MSVPG Day 23 Box Office Collections: మన వరప్రసాద్ కు షాకింగ్ కలెక్షన్స్.. మెగాస్టార్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన లెటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే భారీ స్థాయిలో దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు పూర్తయినా కలెక్షన్లలో ఎక్కడా బ్రేక్ పడకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో వసూళ్లు తగ్గడం సహజమే అయినా, ఈ సినిమాకు మాత్రం కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడం వల్ల వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ సాధించింది. ఈ నేపథ్యంలో 23వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

మన శంకరవర ప్రసాద్ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో తెరకెక్కించగా, చిరంజీవి సరసన నయనతార జంటగా నటించారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. నిర్మాణ పరంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అన్ని కలిసి సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చాయి.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 23 Expected Box Office Collections Worldwide

బడ్జెట్ విషయానికి వస్తే, నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ ఖర్చులు, ప్రమోషన్లు కలిపి ఈ మూవీకి సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. థియేట్రికల్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో హక్కులు రూ.105 కోట్లకు అమ్ముడవ్వగా, ఇండియా వైడ్‌గా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు రూ.20 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ అంచనా. ఈ లెక్కల ప్రకారం, 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ పూర్తిస్థాయిలో బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరం. కానీ సినిమా విడుదలైన తొలి వారంలోనే ఆ లక్ష్యాన్ని దాటేసి, ఇప్పుడు భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది.

మెగాస్టార్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద 3 వారాలు దాటినా నిలకడగా వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తో దూసుకెళ్లింది. ప్రీమియర్స్‌లో రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసిన సినిమా, తొలి రోజున రూ.32.25 కోట్లతో భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్‌లోనే భారీ కలెక్షన్లు అందుకుంది. ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్‌ను సూపర్ స్ట్రాంగ్‌గా ముగించింది.

రెండో వారం ప్రారంభంలో కలెక్షన్లు సహజంగా తగ్గినా, పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, 11వ రోజు రూ.3.3 కోట్లు, 12వ రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకుని 13వ రోజు రూ.4.25 కోట్లు, 14వ రోజు రూ.6.2 కోట్లు రాబట్టింది. మూడో వారం ప్రారంభంలో 15వ రోజు రూ.5 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.3 కోట్లు, 18వ రోజు రూ.1.09 కోట్లు, 19వ రోజు రూ.1.10 కోట్లు, 20వ రోజు రూ.1.6 కోట్లు వసూలు చేసింది. మళ్లీ వీకెండ్ రావడంతో 21వ రోజు రూ.2.84 కోట్లు రాగా, 22వ రోజు సుమారు రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం 22 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా రూ.207.77 కోట్ల నెట్, రూ.245.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'మన శంకర వరప్రసాద్ గారు' మంచి రన్ కొనసాగిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 3.40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.31.12 కోట్లు) రాబట్టగా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలను కలిపి మొత్తం ఓవర్సీస్ కలెక్షన్స్ దాదాపు రూ.46 కోట్లకు చేరినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియా గ్రాస్‌తో కలిపి సాక్‌నిక్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.288 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం మాత్రం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.418 కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించడంతో, ఆ ఫిగర్స్‌పై ట్రేడ్‌లో చర్చ కొనసాగుతోంది.

ఇక 23వ రోజు విషయానికి వస్తే, వర్కింగ్ డే కావడంతో ఆక్యూపెన్సీ తగ్గింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ మాత్రమే నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. అయినప్పటికీ, 23వ రోజు వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.1 కోటి వరకు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో కీలక అంశం ఏమిటంటే... ఇంకా సుమారు రూ.8 కోట్ల గ్రాస్ సాధిస్తే, 'హనుమాన్' మూవీ లైఫ్‌టైమ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ (రూ.294.92 కోట్లు)ను చిరంజీవి సినిమా అధిగమించనుంది. మూడు వారాల తర్వాత కూడా రోజూ వసూళ్లు నమోదు చేస్తూ ముందుకెళ్తున్న ఈ మూవీ, తుది రన్‌లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X