MSVPG Day 24 Box Office Collections: వరప్రసాద్‌కు ఊహించని కలెక్షన్స్.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే భారీ స్థాయిలో దూసుకుపోతోంది. విడుదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తయినా... వసూళ్లలో ఎలాంటి బ్రేక్ లేకుండా స్టడీగా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో కలెక్షన్లు తగ్గడం సహజమే అయినా, ఈ సినిమాకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో డైలీ గ్రాస్ బలంగా నిలుస్తోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే.. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను టచ్ చేయడం విశేషం. తొలి వారంలోనే వరల్డ్‌వైడ్‌గా అవసరమైన గ్రాస్‌ను దాటేయడంతో, ప్రస్తుతం ఈ మూవీ లాభాల బాట దూసుకెళ్తుంది.ఈ నేపథ్యంలో 24వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

ఈ మూవీని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్ని ఒకే ప్యాకేజ్‌గా సినిమా రూపొందడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. నిర్మాణ పరంగా షైన్ స్క్రీన్స్ - గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ కలిసి సినిమాకు పక్కా కమర్షియల్ టచ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి డైలాగ్ బ్రాండింగ్ హాల్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చిపెడుతున్నాయి.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 24 Expected Box Office Collections Worldwide

బడ్జెట్ విషయానికి వస్తే... నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ టీమ్ ఖర్చులు, భారీ ప్రమోషన్లు కలిపి ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో హక్కులు సుమారు రూ.105 కోట్లకు అమ్ముడవ్వగా, ఇండియా వైడ్‌గా బిజినెస్ దాదాపు రూ.120 కోట్లకు క్లోజ్ అయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్. మొత్తంగా చూస్తే ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం పూర్తి స్థాయి బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.300 కోట్ల గ్రాస్ అవసరం.కానీ సినిమా విడుదలైన తొలి వారంలోనే ఆ మైలురాయిని దాటేసి, ఇప్పుడు లాభాల దిశగా దూసుకుపోతోంది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది. ప్రీమియర్స్‌లోనే రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసిన సినిమా, తొలి రోజున రూ.32.25 కోట్లతో భారీ ఓపెనింగ్ నమోదు చేసి తన రేంజ్ చూపించింది. ఆ తర్వాత కూడా కలెక్షన్ల జోరు తగ్గలేదు. రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్‌లోనే భారీ గ్రాస్ అందుకుంది. ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్‌ను సూపర్ స్ట్రాంగ్‌గా ముగించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్లు ఆశించిన స్థాయిలోనే కొనసాగాయి.

రెండో వారం మొదలైన తర్వాత సహజంగానే వసూళ్లు కొంత తగ్గినా పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, 11వ రోజు రూ.3.3 కోట్లు, 12వ రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకుని 13వ రోజు రూ.4.25 కోట్లు, 14వ రోజు రూ.6.2 కోట్లు రాబట్టింది. దీంతో రెండో వారాంతంలో కూడా డిస్ట్రిబ్యూటర్లకు రిలీఫ్ ఇచ్చే నెంబర్లు వచ్చాయి.

మూడో వారం ప్రారంభంలో 15వ రోజు రూ.5 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.3 కోట్లు, 18వ రోజు రూ.1.09 కోట్లు, 19వ రోజు రూ.1.10 కోట్లు, 20వ రోజు రూ.1.6 కోట్లు వసూలు చేసింది. మళ్లీ వీకెండ్ రావడంతో 21వ రోజు రూ.2.84 కోట్లు రాగా, 22వ రోజు సుమారు రూ.1 కోటి, 23వ రోజు మరో రూ.1 కోటి వరకు వసూలైనట్లు ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు వెల్లడించాయి. ఈ లెక్కల ప్రకారం కేవలం 23 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా రూ.209.05 కోట్ల నెట్, రూ.246.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మన శంకర వరప్రసాద్ గారు మంచి రన్ కొనసాగిస్తోంది. మొత్తం ఓవర్సీస్ వసూళ్లు దాదాపు రూ.48 కోట్లకు చేరినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియా గ్రాస్‌తో కలిపి ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.289.1 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. అయితే మేకర్స్ మాత్రం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.418 కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించడంతో, ఈ ఫిగర్స్‌పై ట్రేడ్‌లో చర్చ కొనసాగుతోంది.

ఇక 24వ రోజు వర్కింగ్ డే కావడంతో ఆక్యూపెన్సీ తగ్గింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 12 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ మాత్రమే నమోదైనట్లు సమాచారం. దీంతో 24వ రోజు వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... ఇంకా సుమారు రూ.5 కోట్ల గ్రాస్ సాధిస్తే, ఈ సినిమా హనుమాన్(Hanu-Man) లైఫ్‌టైమ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ (రూ.294.92 కోట్లు)ను కూడా అధిగమించనుంది. ఇలా నాలుగో వారం నడుస్తున్నప్పటికీ రోజూ ఏదో ఒక స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తూ ముందుకెళ్తున్న మన శంకర వరప్రసాద్ గారు, తుది రన్‌లో మరిన్ని రికార్డులను టచ్ చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X