MSVPG Day 25 Box Office Collections: మెగాస్టార్ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్.. వరప్రసాద్ మూవీకి ఎన్ని కోట్లంటే
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను భారీగా థియేటర్లకు రప్పించింది. మెగాస్టార్ మాస్ ఇమేజ్‌కు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాచ్ కావడంతో సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు అయినా... వసూళ్లలో ఎలాంటి బ్రేక్ లేకుండా స్టడీగా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో 25వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. ప్రీమియర్స్‌తోనే రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా, తొలి రోజే రూ.32.25 కోట్లతో భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్‌లోనే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్‌ను సూపర్ స్ట్రాంగ్‌గా ముగించింది. పండుగ సీజన్ కావడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడం ఈ స్థాయిలో వసూళ్లకు ప్రధాన కారణంగా మారింది.

రెండో వారం ప్రారంభమైన తర్వాత సహజంగానే కలెక్షన్లు కొంత తగ్గినా పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, 11వ రోజు రూ.3.3 కోట్లు, 12వ రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకుని 13వ రోజు రూ.4.25 కోట్లు, 14వ రోజు రూ.6.2 కోట్లు, 15వ రోజు రూ.5 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.3 కోట్లు, 18వ రోజు రూ.1.09 కోట్లు, 19వ రోజు రూ.1.10 కోట్లు, 20వ రోజు రూ.1.6 కోట్లు వసూలు చేసింది. వీకెండ్‌తో మళ్లీ కొంత బూస్ట్ వచ్చి 21వ రోజు రూ.2.84 కోట్లు రాగా, 22వ రోజు సుమారు రూ.1 కోటి, 23వ రోజు మరో రూ.1 కోటి, 24వ రోజు దాదాపు రూ.0.80 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు వెల్లడించాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం 24 రోజుల్లోనే ఇండియాలో సినిమా సుమారు రూ.209.65 కోట్ల నెట్, రూ.247.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'మన శంకర వరప్రసాద్ గారు' మంచి రన్ కొనసాగిస్తోంది. అక్కడ దాదాపు రూ.48 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియా గ్రాస్‌తో కలిపి ఇప్పటివరకు ఈ మన శంకర వర ప్రసాద్ మూవీ వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.290.25 కోట్ల గ్రాస్‌కు చేరినట్లు సమాచారం. ఇక 25వ రోజు వర్కింగ్ డే కావడంతో ఆక్యుపెన్సీ కొంత తగ్గింది. గురువారం మధ్యాహ్నం వరకు సుమారు 12 శాతం మాత్రమే థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుండగా, ఆ రోజు వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. మన శంకర వరప్రసాద్ గారు మూవీ కేవలం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్ల గ్రాస్ సాధించి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ రికార్డ్ నమోదు చేసిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తొలి సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' నిలవడం విశేషం. మూవీ మేకర్స్ ప్రకటన ప్రకారం.. ఈ సినిమా మొదటి వారంలోనే ఏకంగా రూ. 292 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తొలి వారం రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తొలి ప్రాంతీయ సినిమాగా రికార్డు చేసిందట.
ఇప్పటి వరకు తెలుగు వెర్షన్‌లో మాత్రమే విడుదలై భారీ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో 'మన శంకర వర ప్రసాద్ గారు' అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత అత్తాగారింటికి దారేది, గుంటురు కారం, సర్కార్ వారి పాట,మహర్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వెర్షన్‌లోనే విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టినవే కావడం గమనార్హం. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. దాదాపు $5 మిలియన్ల డాలర్లు వసూలు చేసి, చిరంజీవి కెరీర్‌లోనే ఈ మార్క్ చేరిన తొలి చిత్రంగా 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డ్ నెలకొల్పింది.
ఇది మెగాస్టార్‌కు విదేశీ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఇంకో విశేషం ఏమిటంటే... ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో (BookMyShow) లో ఈ సినిమాకు ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ టికెటింగ్‌లోనూ ఈ సినిమా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఇలా వరుస రికార్డులతో చిరంజీవి కెరీర్‌లో ఈ మూవీ మరో మైలురాయిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











