MSVPG Day 26 Box Office Collections: నాలుగు వారాలైనా తగ్గని జోరు.. మన శంకర వరప్రసాద్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, మాస్ ఆడియన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను భారీగా థియేటర్లకు రప్పించింది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలవడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు పూర్తైనా... కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో 25వ రోజు చిరంజీవి మూవీ న్ని కోట్లు వసూలు చేసిందంటే?

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కథ పరంగా చూస్తే.. జాతీయ భద్రతా అధికారిగా చిరంజీవి చేసే ప్రయాణం, తన దూరమైన కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రేమ, బాధ్యత, విమోచనాన్ని తిరిగి కనుగొనే భావోద్వేగ కథనమే ఈ సినిమా. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాను సమతూకంగా మిక్స్ చేసిన అనిల్ రావిపూడి నేరేషన్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. హీరోయిన్‌గా నయనతార మెప్పించగా, వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్, రేవంత్ భీమల తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 26 Expected Box Office Collections Worldwide

బడ్జెట్ - డిజిటల్ డీల్ వివరాలు
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నటీనటుల రెమ్యూనరేషన్, టెక్నికల్ టీమ్ ఖర్చులు, ప్రొడక్షన్ వ్యయాలు కలిపి ఈ సినిమాను సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు ట్రేడ్ సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్టు అంచనా. ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దాదాపు రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినిపిస్తోంది. థియేటర్లలో భారీ లాభాల బాటలో పరుగులు పెడుతున్న ఈ మెగా మూవీ, ఓటీటీలోనూ అదే స్థాయి స్పందన రాబట్టే అవకాశముందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

చిరంజీవి మూవీ బాక్సాఫీస్ వద్ద అసాధారణ రన్ కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రీమియర్స్‌తోనే రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసి స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చింది. తొలి రోజే రూ.32.25 కోట్ల ఓపెనింగ్ నమోదు చేసిన సినిమా, ఆ తర్వాత వరుసగా రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు రాబట్టి మొదటి వీకెండ్‌ను అద్భుతంగా ముగించింది. అయిదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసి ఫస్ట్ వీక్‌ను సూపర్ స్ట్రాంగ్‌గా క్లోజ్ చేసింది. పండుగ సీజన్ కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడంతో భారీ కలెక్షన్లు వచ్చాయి.

ఇక రెండో వారం మొదలైన తర్వాత కలెక్షన్లు సహజంగానే కొంత తగ్గినా పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, 11వ రోజు రూ.3.3 కోట్లు, 12వ రోజు రూ.2.65 కోట్లు రాబట్టింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకుని 13వ రోజు రూ.4.25 కోట్లు, 14వ రోజు రూ.6.2 కోట్లు వసూలు చేసింది. 15వ రోజు రూ.5 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.3 కోట్లు, 18వ రోజు రూ.1.09 కోట్లు, 19వ రోజు రూ.1.10 కోట్లు, 20వ రోజు రూ.1.6 కోట్లు వసూలు చేసింది. వీకెండ్‌తో మళ్లీ కొంత బూస్ట్ వచ్చి 21వ రోజు రూ.2.84 కోట్లు, రాగా, 22వ రోజు సుమారు రూ.1 కోటి వరకూ కలెక్షన్లు అందుకున్నాయి. అయితే.. 23వ రోజు మరో రూ.90 కోటి, 24వ రోజురూ 80 లక్షలు, 25 వ రోజు రూ. 70 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు వెల్లడించాయి.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం 25 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా సుమారు రూ.210 కోట్ల నెట్, రూ.248 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో దాదాపు రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టడంతో, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రూ.291 కోట్ల మార్క్‌కు చేరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా... మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ సాధించి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కేవలం తెలుగు వెర్షన్‌లోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా ఇది నిలవడం విశేషం.

ఇప్పటి వరకు తెలుగు భాషలో మాత్రమే విడుదలై భారీ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మన శంకర వరప్రసాద్ గారు అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఓవర్సీస్‌లో దాదాపు 5 మిలియన్ డాలర్లు వసూలు చేసి, చిరంజీవి కెరీర్‌లో ఈ మార్క్ చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు నెలకొల్పింది. ఇది మెగాస్టార్‌కు విదేశీ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది. మరో విశేషం ఏమిటంటే... ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమాకు ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం. థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ టికెటింగ్‌లోనూ ఈ మూవీ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

ఓటీటీ ఎంట్రీ
ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ మెగా మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ప్లాట్‌ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా విడుదల కానుండటంతో డిజిటల్ ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా థియేటర్లలో వరుస రికార్డులు కొల్లగొట్టిన మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తుందా? మెగాస్టార్ మరో డిజిటల్ మైలురాయి నమోదు చేస్తారా? అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X