MSVPG Day 27 Box Office Collections: వీకెండ్ లో శంకర వరప్రసాద్ జోరు.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో పరుగులు పెడుతోంది. విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్... మాస్ ఆడియన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా భారీగా థియేటర్లకు రప్పించింది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ టచ్ కలవడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాలుగు వారాలు పూర్తైనా కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో27వ రోజు చిరంజీవి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాను సమతూకంగా మిక్స్ చేసిన అనిల్ రావిపూడి నేరేషన్ ప్రేక్షకులతో బలమైన కనెక్షన్ ఏర్పరచుకుంది. హీరోయిన్‌గా నయనతార ఆకట్టుకోగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్, రేవంత్ భీమల తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకి సంగీతం భీమ్స్ సిసిరోలో అందించారు. నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ టీమ్ ఖర్చులు, ప్రొడక్షన్ వ్యయాలు కలిపి సినిమా బడ్జెట్ సుమారు రూ.250 కోట్లుగా ట్రేడ్ అంచనా వేస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు సమాచారం. ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దాదాపు రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినిపిస్తోంది.

మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అసాధారణ రన్ కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం... ప్రీమియర్స్‌తోనే రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసి స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చింది. తొలి రోజే రూ.32.25 కోట్ల ఓపెనింగ్ నమోదు చేసిన సినిమా, రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు రాబట్టి తొలి వీకెండ్‌ను అద్భుతంగా ముగించింది. అంతేకాదు, అయిదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసి ఫస్ట్ వీక్‌ను సూపర్ స్ట్రాంగ్‌గా క్లోజ్ చేసింది. పండుగ సీజన్ కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడంతో మొదటి వారం కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.
రెండో వారం మొదలైన తర్వాత సహజంగానే వసూళ్లు కొంత తగ్గినా పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, 11వ రోజు రూ.3.3 కోట్లు, 12వ రోజు రూ.2.65 కోట్లు రాబట్టింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకుని 13వ రోజు రూ.4.25 కోట్లు, 14వ రోజు రూ.6.2 కోట్లు వసూలు చేసింది. ఆపై 15వ రోజు రూ.5 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.3 కోట్లు, 18వ రోజు రూ.1.09 కోట్లు, 19వ రోజు రూ.1.10 కోట్లు, 20వ రోజు రూ.1.6 కోట్లు వసూలు చేసింది. మరో వీకెండ్‌తో కొంత బూస్ట్ వచ్చి 21వ రోజు రూ.2.84 కోట్లు రాగా, 22వ రోజు సుమారు రూ.1 కోటి వరకూ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక 23వ రోజు సుమారు రూ.90 లక్షలు, 24వ రోజు రూ.80 లక్షలు, 25వ రోజు రూ.70 లక్షలు, 26వ రోజు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు వెల్లడించాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం 26 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా సుమారు రూ.210.83 కోట్ల నెట్, రూ.249.1 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో దాదాపు రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టడంతో, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రూ.291.85 కోట్ల మార్క్‌కు చేరినట్లు సమాచారం. ఇక 27వ రోజు (నేడు) వీకెండ్ ప్రారంభం కావడంతో ఆక్యుపెన్సీ కొంత పెరిగే అవకాశముంది. శనివారం మధ్యాహ్నం వరకు సుమారు 14 శాతం మాత్రమే థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుండగా, ఆ రోజు వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ .1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ సాధించి రీజినల్ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు ప్రకటించారు. కేవలం తెలుగు వెర్షన్‌లోనే విడుదలై ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలవడం విశేషం. ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ మెగా మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ విడుదల కానుండటంతో, ఓటీటీలోనూ భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థియేటర్లలో చిరంజీవి మ్యాజిక్ కొనసాగుతూనే ఉండగా, డిజిటల్ రిలీజ్‌తో మన శంకర వరప్రసాద్ గారు మరోసారి కొత్త ఆడియన్స్‌ను చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications











