MSVPG Day 28 Box Office Collections: ఆగని మన శంకర వర ప్రసాద్ జాతర... మెగాస్టార్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో పరుగులు పెడుతోంది. విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, రికార్డు కలెక్షన్లు అందుకుంది. సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్‌ మారింది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ టచ్ కలవడంతో సినిమా అన్ని వర్గాల్లోనూ స్ట్రాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ సాలిడ్ ఆక్యుపెన్సీలతో కొనసాగుతూ, లాంగ్ రన్‌లో కూడా ఎక్స్‌లెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో28వ రోజు చిరంజీవి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి అందించిన నేరేషన్ ప్రేక్షకులతో స్ట్రాంగ్ కనెక్ట్ ఏర్పరచుకుంది. మెగాస్టార్ ఎనర్జీకి ఫ్యామిలీ టచ్ జోడించి సినిమాను పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. హీరోయిన్‌గా నయనతార తన గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా... విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. అలాగే వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్, రేవంత్ భీమల తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలో సంగీతం అందించగా, పాటలు-బీజీఎం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 28 Expected Box Office Collections Worldwide

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ టీమ్, ప్రొడక్షన్ వ్యయాలు కలిపి సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ.250 కోట్ల వరకు వెళ్లిందని సమాచారం. రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు టాక్. ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దాదాపు రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొత్తానికి భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగిస్తూ ట్రేడ్‌ను ఆశ్చర్యపరుస్తోంది.

మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన లాంగ్ రన్ కొనసాగిస్తోంది. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే సంచలనం సృష్టించింది. ప్రీమియర్ షోలతోనే రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసి స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చిన సినిమా... తొలి రోజే రూ.32.25 కోట్ల భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు రాబట్టి ఫస్ట్ వీకెండ్‌ను గ్రాండ్‌గా ముగించింది. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో వీకెండ్ కలెక్షన్స్ ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచాయి.

వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా డ్రాప్ పెద్దగా కనిపించలేదు. అయిదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసి తొలి వారం మొత్తాన్ని సూపర్ స్ట్రాంగ్‌గా క్లోజ్ చేసింది. పండుగ సీజన్ కావడం, పాజిటివ్ టాక్ కొనసాగడం, కుటుంబ ప్రేక్షకుల భారీ సపోర్ట్ ఈ ఫస్ట్ వీక్ రన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.రెండో వారం ప్రారంభమైన తర్వాత సహజంగానే వసూళ్లు కొంత తగ్గాయి. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, 11వ రోజు రూ.3.3 కోట్లు, 12వ రోజు రూ.2.65 కోట్లు రాబట్టింది. అయితే వీకెండ్ రావడంతో మళ్లీ బూస్ట్ వచ్చి 13వ రోజు రూ.4.25 కోట్లు, 14వ రోజు రూ.6.2 కోట్లు వసూలు చేసింది.

ఇక మూడో వారం కూడా స్టెడీగా సాగింది. 15వ రోజు రూ.5 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.3 కోట్లు, 18వ రోజు రూ.1.09 కోట్లు, 19వ రోజు రూ.1.10 కోట్లు, 20వ రోజు రూ.1.6 కోట్లు రాగా... మరో వీకెండ్‌తో 21వ రోజు రూ.2.84 కోట్లు వచ్చాయి. నాలుగో వారం ప్రారంభంలో 22వ రోజు సుమారు రూ.1 కోటి నమోదు కాగా, 23వ రోజు రూ.90 లక్షలు, 24వ రోజు రూ.80 లక్షలు, 25వ రోజు రూ.70 లక్షలు, 26వ రోజు రూ.50 లక్షలు, 27వ రోజు సుమారు రూ.60 లక్షలు వసూలైనట్లు ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు వెల్లడించాయి.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం 27 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా రూ.211.37 కోట్ల నెట్, రూ.249.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో దాదాపు రూ.43 కోట్ల గ్రాస్ రావడంతో వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రూ.292.4 కోట్లకు చేరినట్లు సమాచారం. నాలుగు వారాలు దాటినా రోజుకు లక్షల స్థాయిలో వసూళ్లు రావడం ఈ సినిమా లాంగ్ రన్ స్టామినాను స్పష్టంగా చూపిస్తోంది. ఇక 28వ రోజు (నేడు) వీకెండ్ ప్రారంభం కావడంతో ఆక్యుపెన్సీ కొంత పెరిగే అవకాశముంది. ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 14శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుండగా, ఆ రోజు వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం మాత్రం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ సాధించి రీజినల్ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలిపారు. కేవలం తెలుగు వెర్షన్‌తోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషంగా మారింది. ఇక థియేటర్లలో మెగాస్టార్ మ్యాజిక్ కొనసాగుతూనే ఉండగా, ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు కూడా సిద్ధమవుతోంది ఈ చిత్రం. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో స్ట్రీమింగ్ కానుండటంతో, డిజిటల్ ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాలుగు వారాలు దాటినా బాక్సాఫీస్ వద్ద స్టెడీగా నిలబడుతూ 'మన శంకర వరప్రసాద్ గారు' చిరంజీవి స్టార్ పవర్‌ను మరోసారి రుజువు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X