MSVPG Day 5 Box Office Collections: బాక్సాఫీస్‌లో మన శంకరవరప్రసాద్ గారు హవా.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. సంక్రాంతి పోటీలోనూ స్ట్రాంగ్ కలెక్షన్లతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ నుంచే భారీ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా- నైజాం- సీడెడ్ కలిపి థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ కాగా, ఇండియా మొత్తంగా ఇది రూ.120 కోట్లకు చేరింది. ఓవర్సీస్‌లో నార్త్ అమెరికా రైట్స్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్టు సమాచారం.ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ కోసం రూ.280-300 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ చెబుతున్నా, పాజిటివ్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ బలంతో సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సేఫ్ జోన్ దిశగా వేగంగా సాగుతోంది.

మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి వారం అంతా భారీ కలెక్షన్లతో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల పరంగా సినిమా ట్రేడ్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ప్రీమియర్ షోలతో ఇండియా నెట్‌గా రూ. 9.35 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత తొలిరోజు (మొదటి సోమవారం)న వసూళ్ల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఇండియా నెట్‌గా రూ. 32.25 కోట్లు వసూలు చేయడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడంతో సినిమాకు స్ట్రాంగ్ ఓపెనింగ్ లభించింది.
ఇక రెండో రోజు (మంగళవారం) రోజున కాస్త డ్రాప్ కనిపించింది. ఆ రోజు సినిమా రూ.18.75 కోట్ల నెట్ వసూలు చేయగా, మొదటి రోజుతో పోలిస్తే సుమారు 41.86 శాతం తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ, మొత్తంగా స్ట్రాంగ్ వసూళ్లు అందుకుంది. డే 3 (బుధవారం) రోజున మళ్లీ కాస్త రికవరీ కనిపించింది. బుధవారం సినిమా రూ.19.50 కోట్ల నెట్ వసూలు చేసి, మంగళవారంతో పోలిస్తే 4 శాతం గ్రోత్ నమోదు చేయడం విశేషం. ఇక నాలుగవ రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి. ఫ్యామిలీ ఆడియన్స్ స్టెడీగా థియేటర్లకు రావడంతో ఇండియా నెట్ కలెక్షన్ రూ. 22 కోట్లు చేరింది. ఇది ముందు రోజుతో పోలిస్తే 12.82 శాతం కలెక్షన్లు పెరుగుదల కావడం గమనార్హం.
అయితే ఐదవ రోజు (మొదటి శుక్రవారం) కూడా ఇదే జోరు కొనసాగేలా ఉంది. ఇతర చిన్న సినిమాలు పోటీలో ఉన్నా తగ్గేలే అన్నట్టుగా దూసుకెళ్తుంది. ఐదో రోజు కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ. 16 నుంచి రూ.18 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన నాలుగో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 24 నుంచి 26 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం.. మొత్తం నాలుగు రోజుల్లో సినిమా ఇండియాలో రూ. 120 నుంచి 124 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా.
ఇదిలా ఉంటే.. ఇదే సమయంలో మూవీ మేకర్స్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ మరింత హీట్ పెంచింది. మూవీ మేకర్స్ ప్రకటన ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజే రూ. 84 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్, మూడో రోజుకే రూ. 150 కోట్ల క్లబ్, ఇక 4 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిందని వెల్లడించారు. అంతేకాదు, అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసిందని కూడా స్పష్టం చేశారు. చిరంజీవి- వెంకటేష్ కాంబో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా, దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మరోసారి హిట్ కొట్టినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాను సంక్రాంతి రేసులో ముందుండేలా చేస్తోంది.


Click it and Unblock the Notifications











