MSVPG Day 7 Box Office Collections: 300 కోట్ల క్లబ్‌‌లో మన శంకరవరప్రసాద్ గారు.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే ?

Mana Shankara Vara Prasad Garu Collections: సంక్రాంతి పండగ వాతావరణం ఇంకా థియేటర్లలో తగ్గలేదు. ఈసారి పండక్కి మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులకు గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా తొలి రోజునుంచే థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఏడో రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. వింటేజ్ చిరు కామెడీ, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవిని పూర్తి స్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చూడటంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 7 Expected Box Office Collections Worldwide

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే భారీ బజ్ ఏర్పడింది. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం జరగడం ప్రీ రిలీజ్ బిజినెస్‌ను భారీగా పెంచాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ కాగా, ఇండియా మొత్తం కలిపితే ఇది దాదాపు రూ.120 కోట్లకు చేరినట్లు ట్రేడ్ అంచనా. ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ కోసం సినిమా రూ.280-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది.

కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రీమియర్ షోలతోనే సినిమాకు స్ట్రాంగ్ స్టార్ట్ లభించింది. తొలి రోజున ఇండియా నెట్‌గా రూ.32.25 కోట్లు వసూలు చేసి ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. రెండో రోజు రూ.18.75 కోట్ల నెట్ వసూళ్లు రాగా, మూడో రోజు మళ్లీ రికవరీ చూపిస్తూ రూ.19.50 కోట్లు సాధించింది. నాలుగో రోజు ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా రావడంతో ఇండియా నెట్ రూ.22 కోట్లకు చేరింది. ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు ఇండియా వైడ్‌గా రూ.18.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే 'మన శంకర వరప్రసాద్ గారు' వరల్డ్‌వైడ్‌గా రూ.200.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఇండియా నెట్ రూ.139.85 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.166.5 కోట్లు, ఓవర్సీస్ రూ.33.6 కోట్లు వసూలైనట్లు అంచనా.

ఇక ఏడోవ రోజు ( ఆదివారం) కలెక్షన్స్ పెరిగినట్టు తెలుస్తోంది. ఇతర చిన్న సినిమాలు ఈ మెగాస్టార్ మూవీతో పోటీపడుతున్నా.. తగ్గేలేదే అన్నట్టు దూసుకెళ్తుంది. ఏడో రోజు కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ. 14 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.1 కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన ఆరోవ రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 21-23 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం.. మొత్తం ఏడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 160 నుంచి 162 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా.

ఇదిలా ఉంటే..బాక్సాఫీస్ వద్ద మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోందని మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. ఐదో రోజు మరో రూ.26 కోట్ల గ్రాస్‌తో మొత్తం రూ.226 కోట్లకు చేరగా, తాజాగా మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం ఆరు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.261 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

సంక్రాంతి సినిమాలన్నింటితో పోలిస్తే అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఈ మూవీ, అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. ఇదే జోరు కొనసాగితే ఏడు రోజుల్లో రూ.300 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది సంక్రాంతిక వస్తున్నాం సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టి అనిల్ రావిపూడి.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరో రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్దంగా ఉన్నారని భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: chiranjeevi box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X