MSVPG Day 8 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ర్యాంపేజ్.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ, విడుదలైన తొలి వారం పూర్తయ్యే సరికి అద్భుతమైన వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా, మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకుంటూ స్థిరమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఏడో రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్‌గా నయనతార, కీలక పాత్రలో వెంకటేష్ కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. వింటేజ్ చిరు కామెడీ, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ను పూర్తి స్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చూడటంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 8 Expected Box Office Collections Worldwide

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే భారీ బజ్ ఏర్పడింది. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్యాగ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ కాగా, మొత్తం ఇండియాలో ఇది దాదాపు రూ.120 కోట్లకు చేరింది. ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ సమాచారం. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ కోసం సినిమా రూ.280-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది.

ట్రెడ్ మార్కెట్ అంచనాల ప్రకారం కలెక్షన్స్ చూస్తే.. చిరంజీవి సినిమా మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.222.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ముఖ్యంగా డే వైజ్ కలెక్షన్లలో కనిపిస్తున్న స్టెబిలిటీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు వీకెండ్ తర్వాత భారీ డ్రాప్ చూపిస్తుంటే, 'మన శంకర వరప్రసాద్ గారు' మాత్రం వరుసగా ఏడు రోజులు డబుల్ డిజిట్ వసూళ్లు నమోదు చేసి, లాంగ్ రన్‌కు కొనసాగిస్తుంది.

తెలుగు నెట్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రిమియర్స్ లో రూ.9.35 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా, తొలి రోజున రూ.32.25 కోట్ల భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. రెండో రోజు నుంచి కలెక్షన్లు పెరిగాయి. ముఖ్యంగా నాలుగో రోజు (సోమవారం) రూ.22 కోట్ల కలెక్షన్ నమోదు కావడం విశేషంగా మారింది. మొత్తంగా తొలి ఏడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ రూ.157.75 కోట్లు, ఇండియా గ్రాస్‌గా రూ.187.25 కోట్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'మన శంకర వరప్రసాద్ గారు' సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఓవర్సీస్ లో రూ.35.25 కోట్ల (సుమారు $4.2 మిలియన్) వసూళ్లు రాబట్టి, నార్త్ అమెరికాలో చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అక్కడ మెగాస్టార్ గత రికార్డులను అధిగమిస్తూ, యూఎస్‌లో మాత్రమే $3 మిలియన్ మార్క్‌ను త్వరలోనే టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బుక్‌మైషో వంటి టికెట్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సినిమా దూకుడు చూపిస్తోంది.

తొలి వారం రోజుల్లోనే 2.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం ద్వారా, ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన పలు సినిమాల రికార్డులను కూడా అధిగమించింది. ఈ సినిమాపై ఉన్న ఆడియన్స్ క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. మరి ముఖ్యంగా ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ హీరో సినిమా ఇంత తక్కువ సమయంలో లాభాల్లోకి రావడం అరుదైన మూమెంట్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఎనిమిదో రోజు (ఆదివారం) కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ. 6 -8 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.0.5- 1 కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన ఎనిమిదో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 10-12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం.. మొత్తం ఎనిమిదో రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా.

ఇదిలా ఉంటే.. చిరంజీవి సినిమా ఊహకందని కలెక్షన్లతో ఊచకోత సృష్టిస్తుందనీ, తాజాగా ఈ సినిమా కలెక్షన్ల రిపోర్ట్‌ను మేకర్స్ పోస్ట్ చేశారు. బాక్సాఫీస్‌ దగ్గర రూ.292 కోట్ల సునామీని సృష్టించింది. నేడు ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అందులోను ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. రాబోయే వారంలో కూడా భారీ చిత్రాలేవీ లేకపోవడంతో వసూళ్ల జోరు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X