MSVPG Day 9 Box Office Collections: మనశంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ దూకుడు.. మెగాస్టార్ మూవీకి ఎన్ని కోట్లంట

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, తొలి వారం పూర్తయ్యేలోపే అంచనాలను మించి కలెక్షన్లతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌లో మాస్-ఫ్యామిలీ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీ, రోజురోజుకూ స్థిరమైన వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మన శంకర వర ప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొమ్మిదో రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్‌గా నయనతార, గెస్ట్ రోల్ లో వెంకటేష్ కనిపించడంతో సినిమాపై ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. వింటేజ్ చిరు కామెడీ, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను థియేటర్లకు లాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవిని పూర్తి స్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చూడటం మెగా ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 9 Expected Box Office Collections Worldwide

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే గట్టి బజ్ ఏర్పడింది. చిరంజీవి -అనిల్ రావిపూడి కాంబినేషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్యాగ్‌తో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.105 కోట్లకు క్లోజ్ కాగా, మొత్తం ఇండియాలో ఇది సుమారు రూ.120 కోట్లకు చేరింది. ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తం వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140- 150 కోట్ల మధ్య జరిగిందని ట్రేడ్ అంచనా. ఈ లెక్కల ప్రకారం బ్రేక్‌ఈవెన్ కోసం సినిమా రూ.280-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉండగా, తొలి వారం లోపే బ్రేక్ ఈవెన్ గ్రాస్ అయింది.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. మనశంకర వర ప్రసాద్ గారు సినిమా 8 వ రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రన్ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 8.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, తమిళనాడులో రూ. 0.05 కోట్లు, కర్ణాటకలో రూ. 0.55 కోట్లు, కేరళలో రూ. 0.01 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 0.14 కోట్లు వసూలు చేసింది. ఇలా 8 వ రోజు మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 9.5 కోట్లకు చేరాయి. ఈ లెక్కన 8 రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ. 165.90 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు నమోదు చేసింది. అదే సమయంలో ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ. 197.10 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సినిమా మంచి ప్రదర్శన చూపిస్తూ రూ. 36.15 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో 8 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు మొత్తం రూ. 233.25 కోట్లకు చేరడం విశేషం.

ఇక తొమ్మిదో రోజు ( మంగళవారం) కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ.7-8 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.0.5- 1 కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన తొమ్మిదో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 10-12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం.. మొత్తం ఎనిమిదో రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 207 నుంచి 210 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా.

ఇదిలా ఉంటే.. చిరంజీవి సినిమా కలెక్షన్ పరంగా ఊచకోత కోస్తుంది. మూవీ మేకర్స్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉన్న సైరా రూ. 244 కోట్లు గ్రాస్ రికార్డును 'మన శంకరవరప్రసాద్‌గారు' బద్దలు కొట్టింది. ఫుల్ రన్‌లో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, చిరంజీవి కెరీర్‌లో ఆల్‌టైమ్ హిట్ మూవీగా నిలిచింది. ఈ చిత్రానికి నిర్మాతల్లో చిరంజీవి కుమార్తె సుస్మిత ఒకరు కావడం విశేషం.

గతంలో 'సైరా'ను కుమారుడు రామ్ చరణ్ నిర్మించగా, ఇప్పుడు అత్యధిక వసూళ్లు తెచ్చిన సినిమాను కూతురు అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే.. తొలి రోజు రూ. 84 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండు రోజుల్లోనే రూ. 120 కోట్లకు చేరింది. కేవలం నాలుగున్నర రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన ఈ సినిమా, వారం రోజుల్లో రూ. 292+ కోట్లు దాటేసి, అతి తక్కువ సమయంలో రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రాంతీయ సినిమాగా రికార్డు సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X