Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Waltair Veerayya 10 Days Collections: మెగాస్టార్ బాక్సాఫీస్ దంచుడు.. పదో రోజు వచ్చింది ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల్లో పూనకాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీతో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో వాల్తేరు వీరయ్యగా చిరు సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 106.72 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించగా 10వ రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం!
ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
వాల్తేరు వీరయ్య సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఏపీ, తెలంగాణలో కలుపుకుని నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 6 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 7.50 కోట్లు, కృష్ణా రూ. 5.6 కోట్లు, నెల్లూరు రూ. 3.2 కోట్లతో మొత్తంగా రూ. 72 కోట్లు వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటకలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9 కోట్లతో మొత్తంగా రూ. 88 కోట్లు నమోదు అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదు అయింది.
10వ రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..
శ్రుతి హాసన్, కేథరీన్ ట్రేసా హీరోయిన్స్ గా ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ వివరాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 47.67 శాతం, బెంగళూరులో 42 శాతం, చెన్నైలో 71.33 శాతం, విజయవాడలో 47 శాతం, వరంగల్‌లో 45.33 శాతం, గుంటూరులో 53.33 శాతం, వైజాగ్‌లో 69 శాతం, నిజమాబాద్‌లో 11.67 శాతం, కరీంనగర్లో 69 శాతం, కాకినాడలో 68.67 శాతం, నెల్లూరులో 80 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.
10వ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..
చిరంజీవి-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిందీ వెర్షన్ తెలుగు వెర్షన్ తో పోలీస్తే చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ముంబైలో 4.50 శాతం, ఢిల్లీలో 68 శాతం, పూణె 29.50 శాతం, కోల్‌కతాలో 9 శాతం, ఆహ్మదాబాద్ 5 శాతం, సూరత్‌లో 22.33 శాతం, జైపూర్ 1.50 శాతం, భోపాల్ లో 76.50 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చూపించాయి.
పదవ రోజు కలెక్షన్స్..
మాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు ముందుగానే మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాగా అలాగే కంటిన్యూ అవుతూ ఇప్పటిదాకా దూసుకుపోతోంది. అయితే పదో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా 10వ రోజు రూ. 9 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
10 రోజుల్లో వచ్చింది ఎంతంటే?
చిరంజీవికి వీరాభిమాని అయిన కేఎస్ రవీంద్ర తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ క్యారెక్టర్ హైలెట్ గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఫలితంగా సినిమాకు మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాకు మొత్తం 10 రోజులు కలిపి రూ. 140.05 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.