Waltair Veerayya Day 1 Collections: మెగాస్టార్ మాస్ కుమ్ముడు.. తొలి రోజే అన్ని కోట్లు.. ఇంకొన్ని లక్షలు వస్తే!

గాడ్ ఫాదర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు మొదటిసారిగా నటించిన ఈ మూవీపై మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. స్టోరీ ఎలా ఉన్నా ఎంగేజింగ్ గా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇందులో మరోసారి తనదైన కామెడీతో చిరు అలరించాడని టాక్. సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకున్న వాల్తేరు వీరయ్య తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మైత్రీ మూవీ నిర్మాణంలో..

మైత్రీ మూవీ నిర్మాణంలో..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిత్రమే వాల్తేరు వీరయ్య. ఇందులో మరోక కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ అలరించాడని ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ ఏర్పడింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్, కేథరీన్ ట్రేసాలు హీరోయిన్లు కాగా.. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్..

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్..

వింటేజ్ లుక్ లో అదరగొట్టన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తెలుగుతోపాటు హిందీ వెర్షన్ లో విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మొత్తం కలుపుకుని నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 6 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 7.50 కోట్లు, కృష్ణా రూ. 5.6 కోట్లు, నెల్లూరు రూ. 3.2 కోట్లతో మొత్తంగా రూ. 72 కోట్లు వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్..

సుమారు 22 ఏళ్ల తర్వాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లోని వాల్తేరు వీరయ్య చిత్రానికి ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 2 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. కర్ణాటకలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9 కోట్లుగా తేలింది. దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది వాల్తేరు వీరయ్య చిత్రం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్స్..

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్స్..

వింటేజ్ లుక్ లో అదరగొట్టిన చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 6.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.57 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.68 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.06 కోట్లు, గుంటూరులో రూ. 2.75 కోట్లు, కృష్ణాలో రూ. 1.49 కోట్లు, నెల్లూరులో రూ. 1.05 కోట్లతో కలిపి రూ. 22.90 కోట్లు షేర్, రూ. 35.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ గా వచ్చింది..

వరల్డ్ వైడ్ గా వచ్చింది..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 22.90 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా ప్రపంచవ్యాప్తంగానూ సత్తా చాటింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే విడుదలైన మొదటి రోజు మెగాస్టార్ నటించిన మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 29.30 కోట్లు షేర్‌, రూ. 49.10 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే మరో 90 లక్షలు వచ్చుంటే రూ. 50 కోట్ల మార్క్ ను వాల్తేరు వీరయ్య క్రాస్ చేసేవాడు.

ఇంకా ఎంత రావాలంటే..

ఇంకా ఎంత రావాలంటే..

మెగాస్టార్ చిరంజీవి-బాబీ-రవితేజ వంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. అయితే వాల్తేరు వీరయ్యకు తొలి రోజు రూ. 29.30 కోట్లు సాధించింది. అంటే మరో రూ. 59.70 కోట్లు రాబడితేనే చిరంజీవి సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X