Acharya day 2 collections.. మెగా హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా.. బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఎన్నడూలేనంతగా నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి ఆట నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరవడంతో సినిమా టాక్ ప్రతికూలంగా మారింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా రెండో రోజు దారుణంగా డ్రాప్ అయింది. అయితే ఆచార్య చిత్రం రెండో రోజు సాధించే కలెక్షన్ల అంచనాల ఏవిధంగా ఉన్నాయంటే..

మూడేళ్ల తర్వాత మెగాస్టార్ మూవీ
ఆచార్య చిత్రం ప్రీ బుకింగ్ కూడా అతంత మాత్రంగానే మొదలైంది. అయితే చిరంజీవి, రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమా కావడం, అంతేకాకుండా మెగాస్టార్ నటించిన సినిమా మూడేళ్ల తర్వాత రావడంతో అభిమానులు సినిమాకు తొలి రోజు పోటెత్తారు. అయితే అభిమానులను కూడా ఆచార్య నిరాశపరడంతో సినిమా క్రేజ్ భారీగా పడిపోయింది.

తొలి ఆట నుంచే ప్రతికూలంగా
ఆచార్య మూవీపై భారీగా నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ.. తొలి రోజు భారీగానే వసూళ్లను రాబట్టింది. ప్రతికూల పవనాలు బలంగా వీచినప్పటికి ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఘనమైన కలెక్షన్లను నమోదు చేసింది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల గ్రాస్, 35 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది.

రెండో రోజు భారీగానే..
ఆచార్య మూవీ రెండో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం 65 శాతానికిపైగా టికెట్ల అమ్మకాలు పడిపోయాయనేది ట్రేడ్ వర్గాల టాక్. నైజాంలో ఈ సినిమాపై నెగిటివ్ ఎక్కువగా ఉండగా, సీడెడ్‌లో ఫర్వాలేదనిపించింది. ఆంధ్రాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ కారణంగా మెరుగైన ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

నైజాం, ఆంధ్రాలో రెండో రోజు
ఆచార్య సినిమా అడ్వాన్స్ బుకింగ్ కారణంగా వారాంతంలో ఓ మోస్తారు కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఫ్యామీలి ఆడియెన్స్ ఈ సినిమాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సుమారు 6 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు
అయితే వీకెండ్‌లో ఆచార్య సినిమాకు కొంత మెరుగైన కలెక్షన్లు ఓవర్సీస్‌లో రాబట్టే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఓవర్సీస్ కలెక్షన్లు పాజిటివ్‌గా ఉంటే.. ఈ సినిమా రెండో రోజు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











