Acharya WW Pre release business: మెగాస్టార్ ముందు భారీ టార్గెట్.. ఎంత కలెక్ట్ చేస్తే లాభాల్లోకి వస్తుందంటే?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, రాంచరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య చిత్రం కోసం మెగా అభిమానులు ఎదురు చూపులకు ముగింపు దగ్గరపడింది. ఈ చిత్రం ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో మెగా, పవర్ స్టార్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్సు బుకింగ్ ఊపందుకొన్నది. ఈ క్రమంలో ఆచార్య మూవీ గురించి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ గురించిన వివరాల్లోకి వెళితే..

 టీజర్లు, ట్రైలర్లకు భారీ రియాక్షన్

టీజర్లు, ట్రైలర్లకు భారీ రియాక్షన్

ఆచార్య రిలీజ్‌కు ముందు రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్లు భారీ స్పందనను సొంతం చేసుకొన్నాయి. రాంచరణ్, చిరంజీవి కాంబినేషన్‌లో ఉన్న సీన్లు ఇప్పటికే అభిమానుల్లో పండుగ వాతావారణాన్ని తీసుకొచ్చాయి. రాంచరణ్ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. దాంతో సినీ ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తిని, అంచనాలను పెంచింది.

మహేష్ బాబు వాయిస్ ఓవర్

మహేష్ బాబు వాయిస్ ఓవర్


ఆచార్య సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది సంచలన విషయాలు బయటకు రావడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలకు మహేష్ బాబు తన మాటలను అందించడంతో ఈ సినిమాకు మరింత ఎలివేషన్ దక్కింది.

మహేష్ బాబు వాయిస్ ఓవర్‌పై కొరటాల

మహేష్ బాబు వాయిస్ ఓవర్‌పై కొరటాల

ఆచార్య సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పడంపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఆరంభంలో రెండు నిమిషాల్లో మా కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడానికి ఒక వాయిస్ అవసరమైంది. మా ధర్మస్థలికి సంబంధించిన బ్యాక్ స్టోరిని చెప్పాలని నిర్ణయించాం. ధర్మస్థలి ఎలా ఆవిర్భవించింది.. అమ్మవారు ఎలా వెలిశారు అనే విషయాలను ఒక స్ట్రాంగ్ హీరో చెబితే బాగుంటుందని అనుకొన్నాం. ఆ క్రమంలో మహేష్ బాబును సంప్రదించగా.. అందుకు ఒప్పుకొన్నారు. ధర్మస్థలిలోకి తీసుకెళ్లడానికి మహేష్ బాబు చేసిన కృషికి ధన్యవాదాలు అంటూ కొరటాల శివ వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

ఇలాంటి ప్రత్యేకతలతో ఆచార్య మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా పెరిగిన అంచనాలకు తగినట్టే భారీగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 133 కోట్లకుపైగా బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య

తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 38 కోట్లు, సీడెడ్‌లో 20.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 13 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. ఇక ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలో 9 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 9 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 8 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4.2 కోట్ల బిజినెస్ చేసింది. కేవలం నైజాం, ఆంధ్రాలోనే 109.2 కోట్ల బిజినెస్ చేసింది.

కర్ణాటక, ఓవర్సీస్‌లో మూవీ

కర్ణాటక, ఓవర్సీస్‌లో మూవీ

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా ఆచార్య సినిమా భారీగా బిజినెస్ చేసింది. కర్ఠాటక, ఇతర రాష్ట్రాల్లో ఆచార్య చిత్రం 12 కోట్ల మేర బిజినెస్ చేసింది. అలాగే ఓవర్సీస్‌లో 12 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 133.2 కోట్ల మేర బిజినెస్ చేసింది.

ఆచార్య బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

ఆచార్య బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

ఆచార్య చిత్రం 133 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ చేయడంతో భారీగా ఈ సినిమా ముందు బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 135 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ రేంజ్‌ను ఆచార్య ఎన్ని రోజుల్లో అందుకొంటుందనే విషయం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X