GodFather day 1 collections ఆ రెండు మెగా మూవీస్ రికార్డులు బ్రేక్.. తొలి రోజు గాడ్‌ఫాదర్ కలెక్షన్లు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా భారీ హంగులు, ప్రచార హోరుతో అభిమానులు, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా దర్శకుడు మోహన్ రాజా రూపొందించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఒరిజినల్‌కు మించిన ఫీల్‌తో, తెలుగు ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ హంగులను అద్దుకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రచ్చ మొదలైంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

మలయాళం కంటే బెటర్‌గా

మలయాళం కంటే బెటర్‌గా


లూసిఫర్ రీమేక్‌గా రూపుదిద్దుకొన్న గాడ్‌ఫాదర్ చిత్రం పాజిటివ్ బజ్‌తో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. మలయాళం మాతృకను మరిపించేలా మోహన్ రాజా తెరకెక్కించడంతో తొలి ఆట నుంచి హిట్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. రిలీజైన ప్రతీ చోట సినిమా భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది.

గాడ్‌ఫాదర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

గాడ్‌ఫాదర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్


గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం థియేట్రికల్ హక్కులు 22 కోట్ల మేర అమ్ముడుపోయాయి. సీడెడ్‌లో 13.5 కోట్లు, ఆంధ్రాలో 35 కోట్లతో ఏపీ, తెలంగాణలో 6.5 కోట్లు బిజినెస్ నమోదు చేసింది. ఇక కర్ణాటక హక్కులు 6.5 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు 6.5 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 7.5 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 91 కోట్ల బిజినెస్ చేసింది.

గాడ్ ఫాదర్ థియేటర్ కౌంట్

గాడ్ ఫాదర్ థియేటర్ కౌంట్


ఇక టీజర్, ట్రైలర్స్, ఫస్ట్ లుక్స్, ఇతర ప్రచార అంశాలతో గాడ్‌ఫాదర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 245 పైగా స్క్రీన్లు, సీడెడ్‌లో 160 స్క్రీన్లు, ఆంధ్రాలో 310 స్క్రీన్లతో ఏపీ, నైజాంలో మొత్తం 715 స్క్రీన్లలో రిలీజైంది. ఇక హిందీ, కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో మరో 540 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 450 కోట్లకుపైగా స్క్రీన్లలో ప్రదర్శించారు.

చిరంజీవి గత చిత్రాల వసూళ్ల రికార్డులు

చిరంజీవి గత చిత్రాల వసూళ్ల రికార్డులు


ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన గత చిత్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రం తొలి రోజున 23.25 కోట్లు, సైరా నర్సింహరెడ్డి 38.75 కోట్లు, ఆచార్య చిత్రం 29.5 కోట్లు వసూలు చేసింది. ఆచార్య చిత్రం డిజాస్టర్ టాక్‌తో కూడా భారీ కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

గాడ్‌ఫాదర్ తొలి రోజు కలెక్షన్ల అంచనా

గాడ్‌ఫాదర్ తొలి రోజు కలెక్షన్ల అంచనా


గాడ్ ఫాదర్ తెలుగు రాష్ట్రాల వసూళ్ల విషయానికి వస్తే.. 11 కోట్ల షేర్, 23 కోట్ల గ్రాస్ వసూళ్లను అంచనా వేశారు. ఇక హిందీ వెర్షన్ కలెక్షన్లు 1 కోటి రూపాయలుగా అంచనా వేశారు. ఇండియా వైడ్‌గా ఈ చిత్రం 18 కోట్ల షేర్, 32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక యూఎస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 185 లోకేషన్ల నుంచి ప్రీమియర్లతో కలిపి మొత్తం 400000 అమెరికన్ డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం. ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 38 నుంచి 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

గాడ్‌ఫాదర్ ప్రాఫిట్స్‌లోకి రావాలంటే?

గాడ్‌ఫాదర్ ప్రాఫిట్స్‌లోకి రావాలంటే?


ఇక గాడ్ ఫాదర్ సినిమా బ్రేక్ ఈవెన్ జర్నీ భారీ లక్ష్యంతో మొదలైంది. ఈ సినిమా 92 కోట్ల రూపాయల టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ భారీ అనుకూలంగా మారింది. అంతా సవ్యంగా సాగితే.. తొలి వారాంతంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X