GodFather day 2 collections తెలుగు రాష్ట్రాల్లో జన జాతర.. అమెరికాలో కలెక్షన్ల జోష్.. రెండో రోజు ఎంతంటే?
మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్‌గా వచ్చిన గాడ్‌ఫాదర్ చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. తొలి రోజు వసూళ్లు రాబట్టడంలో తడబాటుకు గురైన ఈ చిత్రం రెండో రోజున బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేస్తుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ జిల్లాలోని రిలీజైన ప్రతీ చోట హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇలాంటి కలెక్షన్ల విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో రెండో రోజు వసూళ్ల ట్రేడ్ వర్గాల అంచనా ఎలా ఉందంటే..

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు
తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా థియేట్రికల్ రిలీజైన గాడ్‌ఫాదర్ భారీ వసూళ్లను సాధించింది. నైజాంలో 3.29 కోట్లు, సీడెడ్‌లో 3.18 కోట్లు, గుంటూరులో 1.75 కోట్లు, కృష్ణా జిల్లాలో 73 లక్షలు, నెల్లూరులో 57 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 59 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 1.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.26 కోట్లతో మొత్తంగా 12.97 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు
ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో 2.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 1.75 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్‌లో 5 కోట్లు, ఇక తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు కలిపి మొత్తంగా 28.7 కోట్ల షేర్.. 38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అమెరికాలో ఊపందుకొన్న కలెక్షన్లు
ఇక రెండో రోజు అమెరికాలో సాధించిన వసూళ్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం 500k డాలర్లను రాబట్టింది. రెండో రోజున 260 లొకేషన్లలో 580 షోల ద్వారా 33k డాలర్లు కలెక్ట్ చేసింది. తొలివారాంతం తర్వాత యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో ఈ చిత్రం చేరడానికి పరుగులు పెడుతున్నది. రెండో రోజు భారీగా కలెక్షన్ల ఊపు కనిపించింది.

ఉత్తరాదిలో టాప్ 5 చిత్రాల్లో
గాడ్‌ఫాదర్ చిత్రం ఉత్తరాదిలో కూడా భారీగానే వసూళ్లను రాబట్టింది. తొలి రోజున 2.01 కోట్ల గ్రాస్, 75 లక్షల రూపాయల షేర్‌ను కలెక్ట్ చేసింది. ఈ ఏడాది ఐదు పాన్ ఇండియా సినిమాలు సాధించిన టాప్ 5 కలెక్షన్ల జాబితాలో గాడ్‌ఫాదర్ కూడా చేరింది.

రెండో రోజు ఆంధ్రా, తెలంగాణలో అక్యుపెన్సీ
గాడ్‌ఫాదర్ సినిమాకు సంబంధించి ఆంధ్రాలో విజయవాడలో 72.5 శాతం అక్యుపెన్సీ, గుంటూరులో 64 శాతం, వైజాగ్‌లో 90 శాతం, కాకినాడలో 99 శాతం, రాజమండ్రిలో 82 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఇక నైజాం విషయానికి వస్తే.. మహబూబ్ నగర్‌లో 68 శాతం, నిజామాబాద్‌లో 52.5 శాతం, వరంగల్‌లో 65.25 శాతం, హైదరాబాద్‌లో 57 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో మొత్తం 660 షోలు ప్రదర్శించడగా..42 శాతం అడ్వాన్స్ బుకింగ్‌తో 1.34 కోట్లు, తెలంగాణలో 639 షోలతో 1.21 కోట్లు రాబట్టింది. అనంతపురంలో రెండో రోజు 17 లక్షల గ్రాస్, రాజమండ్రిలో 24 లక్షల షేర్ సాధించింది. హైదరాబాద్‌లో 350 షోల ద్వారా 61 లక్షల రూపాయలు వసూలు చేసింది.

గాడ్‌ఫాదర్ రెండో రోజు కలెక్షన్ల అంచనా
గాడ్‌ఫాదర్ చిత్రం రెండో రోజు కలెక్షన్ల అంచనాలు ఇలా ఉన్నాయి. రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 18 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 30 నుంచి 35 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











