twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Pre Release Business ఆచార్య డిజాస్టర్ తర్వాత మారిన లెక్కలు.. వరల్డ్‌వైడ్ బిజినెస్ ఎంతంటే?

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం రిలీజ్‌కు ముస్తాబువుతున్నది. సల్మాన్ ఖాన్, నయనతార లాంటి అగ్ర నటులు నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంపై ట్రేడ్ వర్గాల్లో భారీ చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఈ సినిమా ప్రత్యేక పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్నది కనుక.. ఇప్పుడు అందరి దృష్టి సినిమా బిజినెస్‌పైనే ఉంది. గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

     సెకండ్ ఇన్నింగ్ తర్వాత మెగాస్టార్

    సెకండ్ ఇన్నింగ్ తర్వాత మెగాస్టార్

    రాజకీయాలకు స్వస్తి చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఖైదీ నంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 89 కోట్ల మేర చేసింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం రికార్డు బిజినెస్‌ను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు 190 కోట్లకు అమ్ముడుపోయాయి.

    ఆచార్య మూవీపై భారీగా అంచనాలు

    ఆచార్య మూవీపై భారీగా అంచనాలు


    ఇక సైరా తర్వాత కరోనావైరస్ రావడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్రం రెండేళ్లు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాంచరణ్, కొరటాల శివ కాంబినేషన్ కావడంతో భారీగా అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమా ప్రపంచస్థాయి హక్కులను 140 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమా దారుణమైన రిజల్ట్‌ను బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకొన్నది.

     లాభాలు, నష్టాలను బేరీజు వేస్తే..

    లాభాలు, నష్టాలను బేరీజు వేస్తే..


    ఖైదీ నంబర్ 150 చిత్రం 89 కోట్ల మేర బిజినెస్ చేస్తే.. 105 కోట్ల షేర్ సాధించింది. ఇక సైరా 190 కోట్ల బిజినెస్ చేస్తే.. 143 కోట్ల షేర్ సాధించింది. దాదాపు 47 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇక ఆచార్య విషయంలోనే ఊహించని నష్టాలు నమోదయ్యాయి. 140 కోట్ల బిజినెస్ జరిగితే.. 48 కోట్లు మాత్రమే రావడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేసింది.

    గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?


    దాంతో గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ హక్కుల విషయంలో జాగ్రత్తగానే ట్రేడ్ వర్గాలు స్పందించాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులను 90 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 92 కోట్ల మేర బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంటుంది.

    నైజాం, ఆంధ్రాలో బిజినెస్ ఇలా..

    నైజాం, ఆంధ్రాలో బిజినెస్ ఇలా..


    గాడ్‌ఫాదర్ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 18 నుంచి 20 కోట్ల మధ్య, సీడెడ్‌లో 12 కోట్ల రేంజ్‌లో, ఆంధ్రాలో 25 కోట్ల రేంజ్‌లో జరిగినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా బిజినెస్ 55 నుంచి 57 కోట్ల మధ్య నమోదైందనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

    English summary
    Mega Star Chiranjeevi's Godfather movie did fare business worldwide, Here is the pre release business details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X