Chiranjeevi: చిరంజీవి లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్.. ఆ రికార్డ్స్‌ను మన శంకర వరప్రసాద్ గారు బ్రేక్ చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ కెరీర్‌లో 157వ సినిమా రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలతో పాటు సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. అనిల్ రావిపూడి శైలి ఎంటర్టైన్మెంట్‌తో పాటు మెగాస్టార్ మాస్ ఇమేజ్ కలిసి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి.

Chiranjeevi s Last 5 Box Office Collections Can Mana Shankara Varaprasadgaru Break Them

ఈ నేపథ్యంతో.. మెగాస్టార్ గత సినిమా రికార్డులు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2019నుంచి 2023 మధ్య చిరంజీవి సినిమాలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. ముందుగా.. భోళా శంకర్ (2023) భారీ అంచనాలతో విడుదలైనా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.47.5 కోట్ల గ్రాస్‌కే పరిమితమై అండర్‌పర్ఫార్మ్డ్ మూవీగా నిలిచింది. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే.. అదే ఏడాది వచ్చిన 'వాల్తేరు వీరయ్య '(2023) మాత్రం ఎవరూ ఊహించిన విధంగా రూ.232 కోట్ల గ్రాస్‌తో బ్లాక్‌బస్టర్‌గా మెగాస్టార్ రేంజ్‌ను మళ్లీ నిరూపించింది.

అదే విధంగా గాడ్‌ఫాదర్ (2022) రూ.108 కోట్ల గ్రాస్ (షేర్ ₹59.38 కోట్లు) వసూలు చేసింది. ఆశించిన లాభాలు ఇవ్వక అవరేజ్ మూవీగా నిలిచింది. నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక చిరంజీవి-రామ్ చరణ్ కాంబోలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఆచార్య. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం రూ.71 కోట్ల గ్రాస్‌ అందుకుని ఫ్లాప్‌గా నిలిచింది. చిరు కెరీర్ డిజాస్టార్ గా నిలిచింది. ఇక మరోవైపు ప్రతిష్ఠాత్మక పీరియాడిక్ మూవీ సైరా నరసింహారెడ్డి (2019) చిరు కెరీర్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ మూవీ దాదాపు రూ.244 కోట్ల గ్రాస్ (షేర్ రూ. 144.7 కోట్లు) సాధించి హిట్ గా నిలిచింది.

ఇలా చిరంజీవి కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ, మెగాస్టార్ చిరు- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ పాపులార్టీ, అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సంక్రాంతి బరిలో విడుదల ఇలా అన్ని కలిసి ఈ సినిమా మెగాస్టార్ గత రికార్డులను బ్రేక్ చేయగలదా? కొత్త రికార్డులను క్రియేట్ చేయగలదా? అనేది ఉత్కంఠగా మారింది. సంక్రాంతి బరిలో నిలిచిన చిరు సినిమా ఎలాంటి విజయం సాధిస్తోందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X