21 రోజుల సైరా.. మరీ దగ్గరకు వచ్చేసింది! కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన చారిత్రాక మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా సాగిపోతోంది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా 21 రోజుల ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ తెచ్చుకున్న సైరా.. ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే ఇతర ప్రదేశాల్లో సైరా హవా బాగా తగ్గింది.

20వ రోజు పరిస్థితి..
మొదటి వారమంతా భారీ రేంజ్ వసూళ్లను రాబడుతూ వెళ్లిన సైరా 20వ రోజు క్రమంగా స్లో అయింది. 20వ రోజుకు గాను 30 లక్షలకు పైగా షేర్ వేసుకు చేసి, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలల బ్రేక్ ఈవెన్ పాయింట్‌కి మరింత చేరువయింది సైరా నరసింహా రెడ్డి.

ఏరియాల వారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా 20వ రోజు సైరా కలెక్షన్స్ చూసినట్లయితే.. నైజాంలో 8 లక్షలు, సీడెడ్‌లో 5 లక్షలు, ఉత్తరాంధ్రలో 9 లక్షలు, తూర్పు గోదావరి 3 లక్షలు, పశ్చిమ గోదావరి 2 లక్షలు, గుంటూరులో 2.1 లక్షలు, కృష్ణాలో 2 లక్షలు, నెల్లూరులో ఒక లక్ష కలెక్ట్ చేసి మొత్తంగా 0.32 కోట్ల రూపాయలు రాబట్టింది సైరా.

20వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
20 వ రోజుతో పోల్చితే 21 వ రోజు మొత్తం మీద 25% వరకు డ్రాప్స్ నమోదు చేసింది సైరా. 21వ రోజు మొత్తం మీద 20 లక్షల నుండి 24 లక్షల దాకా షేర్ అందుకొని ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. వర్కింగ్ డేస్ కావడంతో సైరా కలెక్షన్స్ భారీగా దెబ్బతింటున్నాయి.
Recommended Video

బ్రేక్ ఈవెన్ కోసం పోరాటం
రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కోసం సైరా పోరాడుతోంది. రానున్నవి దీపావళి పండగ సెలవులు, వీకెండ్ కావడంతో కొంచం జోరు చూపించి ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికి 106 కోట్లు రాబట్టిన ఈ సినిమా మరో కోటి రాబట్టిందంటే తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ దాటేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఇప్పటిదాకా 232 కోట్ల గ్రాస్, 141 కోట్ల షేర్ రాబట్టిన సైరా నరసింహా రెడ్డి.. మరో 47 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ దాటేస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఇక అది అసాధ్యం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











