Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
తగ్గేదే లేదనట్లుగా సైరా జైత్రయాత్ర.. 9 రోజుల్లో వసూళ్లు చూస్తే!
Recommended Video
ప్రపంచ వ్యాప్తంగా సైరా నరసింహా రెడ్డి జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా దేశ విదేశాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి అభినయం మెగా అభిమానులను ఫిదా చేస్తోంది. తొలి రోజే వసూళ్ల పరంపర మొదలు పెట్టిన ఉయ్యాలవాడ వీరుడు నేటికీ ఏ మాత్రం తగ్గడం లేదు.
తండ్రికి మెగా కానుక.. యావత్ సినీ లోకం
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమారు 270 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ సైరా అనిపిస్తోంది. తండ్రికి రామ్ చరణ్ ఇచ్చిన కానుక మెగా అభిమానులతో పాటు యావత్ సినీ లోకాన్ని అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు.
తొలి నుంచి తొమ్మిదో రోజు వరకూ అదే హవా..
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాకు ఓవర్సీస్లో మంచి డిమాండ్ ఉంది. ఓవర్సీస్ మార్కెట్లో అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమా అదే హవా కొనసాగిస్తూ తొమ్మిదో రోజు కూడా ఫినిష్ చేసేసింది.
9 రోజుల్లో కలెక్షన్ వివరాలు చూస్తే
అక్టోబర్ 2వ తేదీన విడుదలై 9 రోజుల్లో యూఎస్ మార్కెట్ లో 2.6 మిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. నిన్నటిదాకా అక్కడి అన్ని లొకేషన్స్ ప్రేక్షకులతో కళకళలాడాయి. యూఎస్ ఆడియన్స్ ఆదరణ చూస్తుంటే మరో వారం పాటు ఈ సినిమాకు డోకా లేదని తెలుస్తోంది.
తెలుగులో ఓకే కానీ.. మిగితా భాషల్లో
ఫ్యాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు ఇతర నాలుగు భాషల్లో సైరా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు వర్షన్ లో 100 కోట్ల మైలురాయిని సునాయాసంగా దాటేసిన ఈ సినిమా.. తమిళ, మళయాళ, హిందీ వెర్షన్లలో మాత్రం డిసప్పాయింట్ చేసింది. తెలుగు మినహాయిస్తే మిగితా భాషల్లో ఈ సినిమా కేవలం 35 కోట్ల రూపాయలే రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు
సైరా నరసింహా రెడ్డి సినిమాకు హాలీడే సీజన్ బాగా కలిసొచ్చింది. దీంతో కలెక్షన్స్ పరంగా యమ స్పీడ్‌గా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అత్యంత వేగంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది సైరా నరసింహా రెడ్డి నిలవడం విశేషం.