సైరా విధ్వంసం.. బాక్సాఫీస్ రికార్డులను చీల్చేస్తూ.. అరుదైన ఫీట్!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతూ కాసుల పంట పండిస్తోంది సైరా నరసింహా రెడ్డి.

కేవలం రెండు రోజుల్లోనే వందకోట్ల గ్రాస్..

కేవలం రెండు రోజుల్లోనే వందకోట్ల గ్రాస్..

అత్యంత భారీ ఎత్తున నిర్మించి, విడుదల చేసిన సైరా.. అదే రేంజ్లో వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ ను రాబట్టి మెగాస్టార్ స్టామినా ఏంటో చూపిన సైరా.. రెండో రోజుతో వందకోట్లను క్రాస్ చేసి 110 కోట్లను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ఓవర్సీస్ జోష్

ఓవర్సీస్ జోష్

తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాకు ఓవర్సీస్ జనం నీరాజనం పలుకుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో సైరా భారీ ఆదరణ తెచ్చుకుంటోంది. అమెరికా మార్కెట్‌లో మంగళవారం రోజు ప్రీమియర్ షోస్ ద్వారా 8,17,0000 డాలర్ల వసూళ్లు రాబట్టిన సైరా.. కెనడాలో మరో 40,122 డాలర్స్ రాబట్టింది. ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయింది.

వసూళ్ల పరంగా శనివారం నాటికి

ఓవర్సీస్ మార్కెట్ లో మంగళవారం రోజు మొదలైన సైరా జోష్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాటికే 1.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసిన సైరా నరసింహా రెడ్డి శనివారం రోజు మరో 3 లక్షల 40 వేల డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం యూఎస్ మార్కెట్‌లో 280 లొకేషన్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది సైరా.

సైరా సునామీ చూస్తుంటే..

సైరా సునామీ చూస్తుంటే..

దేశ విదేశాల్లో సైరా కలెక్షన్ల ప్రవాహం చూస్తుంటే అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 కోట్ల భారీ ప్రీ బిజినెస్ చేసిన సైరా.. మరో ఒకటి రెండు రోజుల్లోనే లాభాల బాటలోకి వచ్చేసి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు

'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో మెగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X