సై సైరా అంటూ దూకుడు.. బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తున్న ఉయ్యాలవాడ వీరుడు

Recommended Video

Anushka Shetty Comments On Sye Raa || చిరు,రామ్ చరణ్‌ కి చాలా థాంక్స్

బాక్సాఫీస్ వద్ద సైరా నరసింహా రెడ్డి జోష్ కొనసాగుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అందరినీ థియేటర్ల బాట పట్టిస్తున్నాడు ఉయ్యాలవాడ వీరుడు. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతూ ట్రేడ్ పండితులకే ఆశ్చర్యం కలిగిస్తోంది సైరా నరసింహా రెడ్డి.

రెండు రోజుల్లోనే ఆ ఫీట్

రెండు రోజుల్లోనే ఆ ఫీట్

రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని అత్యంత భారీ ఎత్తున సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించాడు. సినిమా కోసం ఓ రేంజ్ లో ఖర్చు చేశాడు. విడుదలయ్యాక ఇప్పుడు అదే రేంజ్లో వసూళ్లు రాబడుతోంది సైరా. మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ రాబట్టి మెగాస్టార్ స్టామినా ఏంటో చూపిన సైరా.. రెండో రోజుతో వందకోట్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

జన నీరాజనం.. సైరా హవా

జన నీరాజనం.. సైరా హవా

తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాకు ఓవర్సీస్ జనం నీరాజనం పలుకుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో సైరా భారీ ఆదరణ తెచ్చుకుంటోంది. అమెరికా మార్కెట్‌లో ప్రీమియర్ షోస్ ద్వారా 8,17,0000 డాలర్ల వసూళ్లు రాబట్టిన సైరా అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోయింది.

సై సైరా అంటూ మరో ఫీట్

సై సైరా అంటూ మరో ఫీట్

రోజులు గడుతున్నా కొద్దీ థియేటర్స్ వద్ద సైరా హంగామా పెరుగుతూ వస్తోంది. సై సైరా అంటూ దూకుడుగా వెళ్తోంది సైరా నరసింహా రెడ్డి సినిమా. దేశంలోని అన్నిఏరియాలతో పాటు అమెరికా మార్కెట్‌లో సైరా డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటితో USA లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసి మరో అడుగు ముందుకేశారు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి.

కొణిదెల ప్రొడక్షన్స్ రియాక్షన్

సైరా నరసింహా రెడ్డి దూకుడు చూసి ఆనంద పడుతోంది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ. ఈ మేరకు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలుపుతూ 2 మిలియన్ మార్క్ పోస్టర్ షేర్ చేశారు యూనిట్ సభ్యులు.

సైరా సునామీ చూస్తుంటే..

సైరా సునామీ చూస్తుంటే..

దేశ విదేశాల్లో సైరా కలెక్షన్ల ప్రవాహం చూస్తుంటే అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 కోట్ల భారీ ప్రీ బిజినెస్ చేసిన సైరా.. మరో ఒకటి రెండు రోజుల్లోనే లాభాల బాటలోకి వచ్చేసి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు

'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో మెగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X