సైరా బాక్సాఫీస్ ఫైనల్ రిపోర్ట్.. ఆ ఒక్క ఏరియాలో సరికొత్త సంచలనం

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి సరికొత్త సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా తొలుత సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కానీ ఫైనల్ రన్ వరకు వచ్చే సరికి డీలా పడిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాకపోతే ఒక్క ఏరియాలో మాత్రం సైరా కలెక్షన్ల సునామీ కనిపించిందట. అంతేకాదు సరికొత్త సంచలనానికి తెరలేపింది సైరా. ఇంతకీ ఆ ఏరియా ఏంటి? వివరాల్లోకి పోతే..

తొలి వారం జోష్.. ఆ తర్వాత క్రమంగా

తొలి వారం జోష్.. ఆ తర్వాత క్రమంగా

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సైరా నరసింహా రెడ్డి' మొదటి వారంలో సత్తా చాటింది. భారీ రేంజ్ వసూళ్లు రాబడుతూ కలెక్షన్ల సునామీకి పునాది వేసింది. అయితే ఆ తర్వాత వారాల్లో క్రమంగా వసూళ్లు పడిపోయాయి. తెలుగు భాష మినహాయిస్తే ఇతర భాషల్లో రాను రాను 'సైరా' వసూళ్ల ప్రవాహం బాగా పడిపోయింది.

ఫైనల్ రిపోర్ట్స్ వస్తున్నాయి.. ఏమంటున్నారంటే!

ఫైనల్ రిపోర్ట్స్ వస్తున్నాయి.. ఏమంటున్నారంటే!

తాజాగా సైరా ఫైనల్ రిపోర్ట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ట్రేడ్ పండితులు తమ తమ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నారు. ఆ రిపోర్ట్స్ ప్రకారంగా ఓవర్సీస్‌తో పాటు మిగిలిన అన్ని చోట్ల సైరా నష్టాలు కూడగట్టుకుందని తెలుస్తోంది. అన్ని ఏరియాల్లో దాదాపు సైరా ఫైనల్ జర్నీ కూడా ముగిసినట్లే అంటున్నారు విశ్లేషకులు.

 నైజాం కింగ్.. అన్ని ఏరియాల్లో పరిస్థితి చూస్తే..

నైజాం కింగ్.. అన్ని ఏరియాల్లో పరిస్థితి చూస్తే..

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సైరా ఇప్పటిదాకా 142 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా 189 కోట్ల బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. అంటే ఒకరకంగా నష్టాలు తప్పవని క్లియర్‌గా తెలుస్తోంది. అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఒక్క నైజాంలో మాత్రం 'సైరా' సునామీ చెప్పుకోదగినదిగా ఉంది. మరోసారి నైజాం కింగ్ అని రుజువు చేసుకున్నారు చిరంజీవి.

భారీ ధర పలికి.. చివరకు ఫైనల్ రన్‌లో

భారీ ధర పలికి.. చివరకు ఫైనల్ రన్‌లో

చిరంజీవి కెరీర్ ఆరంభం నుంచే నైజాంలో సత్తా చాటుతూ వస్తున్నారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల ద్వారా నైజాం ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సైరాకి కూడా నీరాజనం పలికారు నైజాం ప్రేక్షకులు. నైజాం ఏరియాలో సైరా సంచలన విజయం సాధించింది. 30 కోట్ల భారీ ధరకు అమ్ముడు పోయిన ఈ సినిమా ఫైనల్ రన్ వచ్చేసరికి 32.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

సరికొత్త సంచలనం.. బాహుబలి తర్వాత

సరికొత్త సంచలనం.. బాహుబలి తర్వాత

నైజాం ఏరియా పరంగా చూస్తే 'బాహుబలి' తర్వాత అంత స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిన సినిమా 'సైరా'నే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 'సైరా' రూపంలో సరికొత్త సంచలనానికి తెరలేపారు చిరంజీవి. కొన్ని దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్న ఆయన యాక్షన్ అంటే నైజాం జనానికి యమ పిచ్చి. సో.. మున్ముందు ఈ ఏరియాలో మెగాస్టార్ సెన్సషన్స్ ఇంకెన్ని చూస్తామో మరి!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X