Waltair Veerayya 20 days Collections 250 కోట్ల క్లబ్‌లో వాల్తేరు వీరయ్య.. చిరంజీవికి ఆ రికార్డు సాధ్యమేనా?
సంక్రాంతి కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య మూడోవారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, అందాల తార శృతిహాసన్ నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. గత 19 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఇక వాల్తేరు వీరయ్య 20వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయనే విషయంలోకి వెళితే..

చిరంజీవి కెరీర్‌లో అత్యధికంగా
వరుస పరాజయాలతో ఊగిసలాటకు గురైన నేపథ్యంలో చిరంజీవి మాస్ ఎలిమెంట్స్, ఫన్, కామెడీ అంశాలతో వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మాస్ అవతారంలో వచ్చిన మెగాస్టార్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాంతో తన కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లను నమోదు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు చేరువగా
వాల్తేరు వీరయ్య చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో నాన్ రాజమౌళి రికార్డులను తిరగరాస్తున్నది. టాలీవుడ్‌లోనే 200 కోట్లు వసూలు చేసేందుకు బాక్సాఫీస్ యాత్రను కొనసాగిస్తున్నది. అయితే 20 రోజుల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్లు భారీగా క్షీణించాయి. అయితే చిరంజీవి ఏపీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు చేరుకొంటుందా? అనే విషయం ఆసక్తిగా మారింది.

గత 19 రోజుల కలెక్షన్లు
వాల్తేరు వీరయ్య చిత్రం గత 19 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలెక్షన్ల భారీగా నమోదు చేసింది. ఏపీ, నైజాంలో 183 కోట్ల గ్రాస్, 114 కోట్ల షేర్ నమోదు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 8 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 29 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

20వ రోజు బాక్సాఫీస్ రిపోర్టు
వాల్తేరు వీరయ్య సినిమా 20వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో 30 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. వరంగల్, గుంటూరు, వైజాగ్, కాకినాడలో సుమారు 30 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

50 కోట్ల లాభాలకు చేరువగా
ఇక వాల్తేరు వీరయ్య 20వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 250 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటికే ఈ చిత్రం 46 కోట్ల లాభాలను సాధించింది. ఇంకా కొద్ది రోజులపాటు థియేట్రికల్ రన్ కొనసాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











