Bhola Shankar Closing Collections: 80 కోట్ల సినిమా.. అప్పుడే ఖేల్ ఖతం.. నష్టాలతో చిరు చెత్త రికార్డు

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏకధాటిగా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అయితే, ఆయనకు ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బిగ్ హిట్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.

ఈ జోష్‌లోనే ఇటీవలే 'భోళా శంకర్' అనే సినిమాను చేశారు. కానీ, ఈ చిత్రం మాత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందనను అందుకోలేదు. దీంతో వారంలోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 'భోళా శంకర్' క్లోజింగ్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

Chiranjeevi Starrer Bhola Shankar Movie Box Office Closing Collections

భోళా శంకర్‌‌గా చిరు ఎంటర్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రమే 'భోళా శంకర్'. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం ఇచ్చాడు.

Chiranjeevi Starrer Bhola Shankar Movie Box Office Closing Collections

భోళా శంకర్ బిజినెస్ డీటేల్స్: ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'భోళా శంకర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ చేసింది.

Chiranjeevi Starrer Bhola Shankar Movie Box Office Closing Collections

అలాంటి టాక్.. కలెక్షన్లు నిల్: సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ సరిగా రాలేదు. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. ఫలితంగా చిరంజీవి సినిమా కేవలం ఒక్క వారం రోజుల్లోనే అన్ని ఏరియాల్లోనూ దాదాపుగా రన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఫలితంగా 'భోళా శంకర్' మూవీకి కోట్లలోనే నష్టాలు ఎదురయ్యాయి.

Chiranjeevi Starrer Bhola Shankar Movie Box Office Closing Collections

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు: 'భోళా శంకర్'కి ఏపీ, తెలంగాణలో ఫుల్ రన్‌లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 6.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.22 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.98 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.21 కోట్లు, గుంటూరులో రూ. 2.68 కోట్లు, కృష్ణాలో రూ. 1.64 కోట్లు, నెల్లూరులో రూ. 1.20 కోట్లతో కలిపి.. రూ. 23.13 కోట్లు షేర్, రూ. 35.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

Chiranjeevi Starrer Bhola Shankar Movie Box Office Closing Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్‌లో రూ. 23.13 కోట్లు రాబట్టిన 'భోళా శంకర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ అంతగా రాణించడం లేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.86 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.21 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.20 కోట్లు షేర్‌, రూ. 43.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

Chiranjeevi Starrer Bhola Shankar Movie Box Office Closing Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, రన్ ముగిసే టైం‌కు దీనికి రూ. 27.20 కోట్లు వచ్చాయి. అంటే.. చిరంజీవి సినిమాకు ఏకంగా రూ. 53.30 కోట్లు మేర నష్టాలు ఎదురయ్యాయి.

Chiranjeevi Starrer Bhola Shankar Movie Box Office Closing Collections

నష్టాలతో చిరు చెత్త రికార్డు: మెహర్ రమేష్ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి మొదటి నుంచీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఈ చిత్రం భారీ నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది. ఇక, చిరంజీవి కెరీర్‌లో 'ఆచార్య' రూ. 84 కోట్లు నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఉండగా.. ఇప్పుడు 'భోళా శంకర్' రూ. 53 కోట్ల లాస్‌తో రెండో స్థానానికి చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X