Bhola Shankar మూవీకి షాకింగ్ బిజినెస్.. 200 కోట్లు కొట్టినా ఇంత తక్కువా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి ఎంతో కష్టపడిన తర్వాత స్టార్‌గా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా ఆయన హవాను చూపిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీనియర్ హీరో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోన్నారు. దీనికితోడు ఈ ఏడాది ఆరంభంలోనే 'వాల్తేరు వీరయ్య'తో 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటారు. ఈ జోష్‌లోనే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 'భోళా శంకర్' అనే సినిమాతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఓ లుక్కేద్దాం పదండి!
భోళా శంకర్‌గా వస్తున్నారు:మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమానే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇచ్చాడు. ఇది ఆగస్టు 11న విడుదల కాబోతుంది.

అలాంటి కథ.. మాస్ ట్రీట్:'భోళా శంకర్' మూవీ తమిళంలో సూపర్ హిట్ అయిన 'వేదాళం'కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, దానికి దీనికి చాలా తేడా ఉండేలా కథలో మార్పులు చేసినట్లు దర్శకుడు మెహర్ రమేష్ స్వయంగా వెల్లడించాడు. ఇక, ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందింది. అంతేకాదు, ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరించోతుందని చెప్పుకోవచ్చు.

గ్రాండ్ రిలీజ్.. సందడిగానే:క్రేజీ కాంబోలో రాబోతున్న 'భోళా శంకర్' మూవీని ఆగస్టు 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, చాలా చోట్ల అప్పుడే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి.

హక్కులకు భారీ డిమాండ్:ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఏపీ, తెలంగాణలో బిజినెస్:'భోళా శంకర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తక్కువ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.40 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4.50 కోట్లు, నెల్లూరులో రూ. 3 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 67.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:చిరంజీవి - మెహర్ కాంబోలో వచ్చిన 'భోళా శంకర్' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే రూ. 80.50 కోట్లు వస్తేనే ఈ సినిమా విజయాన్ని సాధిస్తుంది.

200 కోట్లు కొట్టినా తక్కువా?:వాస్తవానికి ఏ హీరో సినిమా అయినా హిట్ అయితే.. దాని తర్వాత వచ్చే దానికి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అలాంటిది చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ రూ. 200 కోట్లుకు పైగా గ్రాస్‌ను వసూలు చేసినా.. 'భోళా శంకర్'కు మాత్రం తక్కువగా బిజినెస్ అయింది. ఇది ట్రేడ్ వర్గాలనే షాక్‌కు గురి చేస్తోంది. దీంతో టాలీవుడ్‌లో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అవుతోంది.

చిరంజీవి సినిమాల్లో తక్కువ:'భోళా శంకర్' మూవీపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది చిరంజీవి రీఎంట్రీలో అతి తక్కువ బిజినెస్ అని చెప్పాలి. ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150కి రూ. 89 కోట్లు, సైరాకు రూ. 187.25 కోట్లు, ఆచార్య రూ. 131.20, గాడ్ ఫాదర్‌కు రూ. 91 కోట్లు, వాల్తేరు వీరయ్యకు రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది.


Click it and Unblock the Notifications











