Bhola Shankar: వందల థియేటర్లలో భోళా శంకర్.. ఆ సినిమా కంటే తక్కువే.. బాలయ్య రికార్డు బ్రేక్
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే ప్రభావాన్ని ఇప్పటికీ చూపిస్తూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వెళ్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీలో ఏకధాటిగా మూవీలను చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' అనే చిత్రంలో నటించారు.
టలీవుడ్ బడా హీరో చిరంజీవి ప్రస్తుతం 'భోళా శంకర్' అనే చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేశారు. ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వేదాళం'కు రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ ప్రేక్షకుల మన్ననలు పొందాయి. దీంతో ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. నేటి రాత్రి నుంచి ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోలు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అలాగే, శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా షోలు అత్యధికంగా ప్రదర్శితం కాబోతున్నాయి.
'భోళా శంకర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉండడంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ రూ. 79.60 కోట్లు వరకూ జరిగింది. దీనికి తగ్గట్లే ఈ సినిమా నైజాంలో 278, సీడెడ్‌లో 190, ఆంధ్రాలో 410 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 880 నుంచి 900 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 120, ఓవర్సీస్‌లో 500 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1500 నుంచి 1520 థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

ఇక, 'భోళా శంకర్' మూవీకి రజినీకాంత్ 'జైలర్' నుంచి పోటీ ఉండడంతో థియేటర్ల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అంతేకాదు, చిరంజీవి గత చిత్రం 'వాల్తేరు వీరయ్య' 1575 థియేటర్లలో రిలీజ్ అవగా.. ఇది దాని కంటే తక్కువ లొకేషన్లలోనే వస్తుంది. అయితే, చిరంజీవి మూవీ 'వీర సింహా రెడ్డి' థియేటర్ల సంఖ్య (1465)ను మాత్రం దాటేసిందని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్'లో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











