Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సైరా 10 రోజు కలెక్షన్లు.. ఇంకా నష్టాల్లోనే.. లాభాల్లోకి రావాలంటే ఎంతంటే..
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊగిసలాడుతున్నది. ఈ చిత్రం రెండో వారంలోకి ప్రవేశించినప్పటికీ.. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతున్నది. దాంతో ఇంకా లాభాల్లోకి ప్రవేశించడానికి ఈ చిత్రం తంటాలుపడుతున్నది. గత పది రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..
పదో రోజు తగ్గుముఖం
సైరా చిత్రం 9వ రోజుతో పోల్చుకొంటే 10వ రోజుల బాక్సాఫీస్ వద్ద వసూళ్లు క్షీణించాయి. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.2.2 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం.ప్రపంచవ్యాప్తంగా పోల్చుకొంటే మొత్తంగా ఈ చిత్రం రూ.2.7 కోట్ల మేర వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నైజాం, ఉత్తరాంధ్రలో
ఇక నైజాంలో 90 లక్షల మేర వసూలు చేసి మొత్తంగా 29 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది. ఉత్తరాంధ్రలో సైరా చిత్రం పదో రోజున 50 లక్షలకుపైగానే వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఉత్తరాంధ్రలో ఇంకా లాభాల్లోకి రావాలంటే ఇంకా 14 కోట్లు మేర వసూలు చేయాల్సిందే అంటున్నారు.
నైజా, ఏపీలో
ఏపీ, నైజాంలో ఇక సైరా మొత్తంగా వసూళ్లను పరిశీలిస్తే ఒకటో రోజు 38.75 కోట్లు, 2వ రోజు 10.12 కోట్లు, 3వ రోజున 6.93 కోట్లు, 4వ రోజున రూ.6.9 కోట్లు, ఐదో రోజున రూ.8.33 కోట్లు, ఆరో రోజున రూ.5.56 కోట్లు, ఏడో రోజున రూ.7.9 కోట్లు, ఎనిమిదో రోజున రూ.5.91 కోట్లు, తొమ్మిదో రోజున రూ.3.01 కోట్లు, 10 రోజున 2.2 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 95 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈచిత్రం 106 కోట్ల బిజినెస్ జరిగితే.. ఇంకా 11 కోట్ల మేర రాబట్టాల్సింది.
కర్ణాటకలో నిరాశే
ఇక భారీగా ఆశలు పెట్టుకొన్న కర్ణాటకలో కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నది. ఈ చిత్రానికి రూ.26.25 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 10 రోజుల్లో కేవలం 15 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి సరైన థియేటర్లు కేటాయించకపోవడమే అందుకు కారణమనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దక్షిణాదిలో రికార్డు
ఇలాంటి ప్రతికూలతల మధ్య సైరా చిత్రం దక్షిణాదిలో ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం ప్రస్తుత ఏడాదిలో 200 కోట్ల క్లబ్లో చేరిన 4వ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం పేటా, విశ్వం, సాహో తర్వాత సైరా రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.