twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా 10 రోజు కలెక్షన్లు.. ఇంకా నష్టాల్లోనే.. లాభాల్లోకి రావాలంటే ఎంతంటే..

    |

    Recommended Video

    Sye Raa 10 Days Collection Report || ఏపీ, నైజాం,కర్ణాటక కలెక్షన్ వివరాలు

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊగిసలాడుతున్నది. ఈ చిత్రం రెండో వారంలోకి ప్రవేశించినప్పటికీ.. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతున్నది. దాంతో ఇంకా లాభాల్లోకి ప్రవేశించడానికి ఈ చిత్రం తంటాలుపడుతున్నది. గత పది రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

    పదో రోజు తగ్గుముఖం

    పదో రోజు తగ్గుముఖం

    సైరా చిత్రం 9వ రోజుతో పోల్చుకొంటే 10వ రోజుల బాక్సాఫీస్ వద్ద వసూళ్లు క్షీణించాయి. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.2.2 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం.ప్రపంచవ్యాప్తంగా పోల్చుకొంటే మొత్తంగా ఈ చిత్రం రూ.2.7 కోట్ల మేర వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    నైజాం, ఉత్తరాంధ్రలో

    నైజాం, ఉత్తరాంధ్రలో

    ఇక నైజాంలో 90 లక్షల మేర వసూలు చేసి మొత్తంగా 29 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది. ఉత్తరాంధ్రలో సైరా చిత్రం పదో రోజున 50 లక్షలకుపైగానే వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఉత్తరాంధ్రలో ఇంకా లాభాల్లోకి రావాలంటే ఇంకా 14 కోట్లు మేర వసూలు చేయాల్సిందే అంటున్నారు.

    నైజా, ఏపీలో

    నైజా, ఏపీలో

    ఏపీ, నైజాంలో ఇక సైరా మొత్తంగా వసూళ్లను పరిశీలిస్తే ఒకటో రోజు 38.75 కోట్లు, 2వ రోజు 10.12 కోట్లు, 3వ రోజున 6.93 కోట్లు, 4వ రోజున రూ.6.9 కోట్లు, ఐదో రోజున రూ.8.33 కోట్లు, ఆరో రోజున రూ.5.56 కోట్లు, ఏడో రోజున రూ.7.9 కోట్లు, ఎనిమిదో రోజున రూ.5.91 కోట్లు, తొమ్మిదో రోజున రూ.3.01 కోట్లు, 10 రోజున 2.2 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 95 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈచిత్రం 106 కోట్ల బిజినెస్ జరిగితే.. ఇంకా 11 కోట్ల మేర రాబట్టాల్సింది.

     కర్ణాటకలో నిరాశే

    కర్ణాటకలో నిరాశే

    ఇక భారీగా ఆశలు పెట్టుకొన్న కర్ణాటకలో కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నది. ఈ చిత్రానికి రూ.26.25 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 10 రోజుల్లో కేవలం 15 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి సరైన థియేటర్లు కేటాయించకపోవడమే అందుకు కారణమనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

    దక్షిణాదిలో రికార్డు

    దక్షిణాదిలో రికార్డు

    ఇలాంటి ప్రతికూలతల మధ్య సైరా చిత్రం దక్షిణాదిలో ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం ప్రస్తుత ఏడాదిలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన 4వ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం పేటా, విశ్వం, సాహో తర్వాత సైరా రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got positive talk. So this movie gets huge collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X