twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా కలెక్షన్ల స్వైర విహారం.. బాహుబలి2 దాటేసి, ఇండస్ట్రీ రికార్డులతో హోరు

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను కొల్లగొడుతున్నది. అక్టోబర్ 2 తేదీన విడుదలైన ఈ చిత్రం నాన్ హాలీవుడ్ రోజున కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. నైజాం, ఆంధ్రా, సీడెడ్, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా ఈ చిత్రం వసూళ్లను రాబట్టడం విశేషంగా మారింది. గత రెండు రోజుల్లో సైరా ఎంత వసూలు చేసిందంటే..

    ఉత్తరాంధ్రలో

    ఉత్తరాంధ్రలో

    ఉత్తరాంధ్రలో సైరా చిత్రం మొదటి రోజున ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. తొలి రోజున రూ.4.72 కోట్లు సాధించి బాహుబలి2 రికార్డును తిరగరాసింది. బాహుబలి2 ఉత్తరాంధ్రలో రూ.4.52 కోట్లు, సాహో రూ.3.77 కోట్లు, అజాతవాసి రూ.3.74 కోట్లు, అరవింద సమేత రూ.3.12 కోట్లు వసూలు చేసింది.

     కృష్ణా జిల్లాలో

    కృష్ణా జిల్లాలో

    కృష్ణా జిల్లాలో కూడా సైరా బాక్సాఫీస్ వద్ద స్వైర విహారం చేసింది. ఈ జిల్లాలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది. సైరా రూ.3.03 కోట్లు వసూలు చేయగా, బాహుబలి2 రూ.2.83 కోట్లు, సాహో రూ.2.51 కోట్లు రాబట్టింది.

    Recommended Video

    Sye Raa Narasimhaa Reddy Day 2 Collections Report || రెండో రోజూ ఉయ్యాలవాడ వీరుడి జోష్..!!
    గుంటూరులో

    గుంటూరులో

    ఇక గుంటూరులో కూడా సైరా ప్రభంజనం కొనసాగింది. గుంటూరు జిల్లాలో సైరా నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది. బాహుబలి రూ.6.18 కోట్లు సాధించగా, సైరా చిత్రం రూ.5.06 కోట్లు, సాహో రూ.4.7 కోట్లు, మహర్షి చిత్రం రూ.4.4 కోట్లు, వినయ విధేయ రామ రూ.4.2 కోట్లు వసూలు చేసింది.

     తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా

    తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా

    ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు వసూళ్ల విసయానికి వస్తే నైజాంలో రూ.12 కోట్లు, సీడెడ్‌లో రూ.7.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.6 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 కోట్లు, గుంటూరులో రూ.5.73 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.3.74 కోట్లు, నెల్లూరులో రూ.2.40 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలో రూ.49 కోట్లు

    దక్షిణాది, ఓవర్సీస్‌లో

    దక్షిణాది, ఓవర్సీస్‌లో

    దక్షిణాదిలో కూడా మంచి వసూళ్లను సైరా సాధించింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.7.5 కోట్లు, తమిళంలో 1 కోటి, కేరళలో రూ.44 లక్షలు, హిందీలో 2.6 కోట్లు, యూఎస్, కెనడాలో రూ.4.65 కోట్లు సాధించింది. మిగితా దేశాల్లో రూ.2.55 కోట్లు వసూలు చేసింది. ఇక మొత్తంగా ఈ చిత్రం రూ.67.60 కోట్ల షేర్, రూ.110 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got positive talk. So this movie gets huge collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X