సైరా కలెక్షన్ల హోరు.. చిరంజీవి కెరీర్‌లో అరుదైన రికార్డు.. 200 కోట్లకు చేరువగా

Recommended Video

Sye Raa Going Strong At Box-Office || చిరంజీవి కెరీర్‌లో అరుదైన రికార్డు

జాతీయ భావాన్ని తట్టిలేపే కథతో రూపొందిన సైరా నర్సింహారెడ్డి చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్రను లిఖించింది. అక్టోబర్ రెండో తేదీన విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఆదరణతో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ క్రమంలో సైరా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం మీ కోసం..

చిరంజీవి రెండోసారి శతకం

చిరంజీవి రెండోసారి శతకం

మెగాస్టార్ నటించిన సైరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం సోమవారం ఆ మార్కును దాటింది. చిరంజీవి కెరీర్‌లో వరుసగా 100 కోట్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. గతంలో ఖైదీ నంబర్ 150తో ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే.

నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో జోరు

నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో జోరు

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో వసూళ్లపరంగా దూసుకెళ్తున్నది. నైజాంలో ఈ చిత్రం 20 కోట్లకుపైగా, సీడెడ్‌లో సుమారు 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.

ఆంధ్రాలో తగ్గని హోరు

ఆంధ్రాలో తగ్గని హోరు

ఇక సైరా చిత్రం ఆంధ్రాలోని ప్రధాన కేంద్రాల్లో సత్తా చాటుతున్నది. తూర్పు గోదావరి జిల్లాలో రూ. 8 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కోట్లకుపైగా, గుంటూరులో రూ.8 కోట్లు, క‌ృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు, నెల్లూరులో రూ.3.5 కోట్లు సాధించింది. మొత్తంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 80 కోట్ల షేర్‌ సాధించింది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

ప్రభావం చూపలేకపోయిన సైరా

ప్రభావం చూపలేకపోయిన సైరా

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో సైరా వసూళ్లు చతికిలపడ్డాయి. కర్ణాటక, తమిళం, కేరళ, హిందీ రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటకలో రూ.10 కోట్లు, తమిళంలో రూ.1 కోటికిపైగా, కేరళలో 64 లక్షలు సాధించింది. ఇక హిందీలో ఈ చిత్రం రూ.5 కోట్లకుపైగా వసూలు చేసింది.

 ఓవర్సీస్‌లో

ఓవర్సీస్‌లో

ఓవర్సీస్‌లో కూడా సైరా భారీ వసూళ్లను రాబట్టింది. యూఎస్ కెనడాలో ఈ చిత్రం రూ.8 కోట్లు, మిగితా దేశాల్లో రూ.4 కోట్లు రాబట్టింది. ఆరు రోజుల్లో రూ.100 కోట్లకుపైగా (అధికారికంగా రావాల్సింది), 180 కోట్ల గ్రాస్ వసూళ్లతో ముందుకెళ్తున్నది. ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ రూ.187 కోట్ల మేర జరిగింది. ఇంకా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు 90 కోట్లు రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X