Don't Miss!
- News
ఆర్జేడీకి 16, జేడీయూకు 11 పోస్టులు.. ఇదీ మంత్రి మండలి లెక్క
- Sports
Ricky Ponting : ఒకప్పటి ఆస్ట్రేలియా యోధులతో రికీ పాంటింగ్ ఫోటో.. వార్నర్, పంత్ కామెంట్లు
- Automobiles
దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?
- Lifestyle
గుండె జబ్బులకు కారణమేమిటో తెలుసా?
- Finance
Bank FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన 6 బ్యాంకులు ఇవే.. వీటిలో పెట్టుబడి పెట్టండి..
- Technology
ఎయిర్టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది...
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
మళ్లీ దూకుడు పెంచిన సైరా.. టార్గెట్‌కు దగ్గరగా.. కానీ నష్టాలు తప్పేలా లేవు..
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం ప్రశంసలు అందుకున్నా.. టార్గెట్‌ను అందుకోవడంలో కాస్త వెనుకబడింది. ఓ వైపు వార్ చిత్రం బాక్సాఫీస్‌పై యుద్దం చేస్తుండగా.. సైరాకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఉత్తరాదిలో సైరా ప్రభావం అంతగా లేకపోవడం వార్‌కు కలిసిరాగా.. దక్షిణాదిలో వార్ హవా అంతగా లేకపోవడం సైరాకు కలసి వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో హవా..
మిగతా అన్ని భాషల్లో వదిలేస్తే.. తెలుగులో సైరా దుమ్ములేపుతోంది. పదకొండో రోజుకి ఎంటర్ అయినా థియేటర్లతో జనం నిండిపోవడం ఆశ్చర్యకరమే. నిన్న వీకెండ్ మొదలు కావడంతో మళ్లీ థియేటర్లు నిండిపోయినట్లు తెలుస్తోంది. అయితే పదో రోజుతో పోలిస్తే.. పదకొండో రోజు సైరా దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఇక నేడు కూడా సైరా తన హవాను కొనసాగించనున్నట్లు సమాచారం.

పదకొండో రోజు పెరిగిన రాబడి..
పదో రోజు ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లో రూ.2.2 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకొంటే మొత్తంగా ఈ చిత్రం రూ.2.7 కోట్ల మేర వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే పదకొండు రోజు మాత్రం వసూళ్లు పెరిగనట్లు తెలుస్తోంది. వీకెండ్ మొదలవడంలో మళ్లీ పుంజుకున్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

దాదాపు రెట్టింపుగా పెరిగిన వసూళ్లు...
పదో 2.7కోట్ల మేర ఆదాయం తెచ్చిన సైరా.. పదకొండో రోజున దాదాపు రెట్టింపు వసూళ్లను రాబట్టిందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 4నుంచి 5కోట్ల మేరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇలాగే పుంజుకుంటూ వెళితే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

నష్టాలు తప్పేలా లేవు..
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎలాగోలా బ్రేక్ ఈవెన్‌ను సాధించేట్టు కనిపిస్తున్నా... మిగిలిన చోట మాత్రం భారీ నష్టాలు తప్పేలా లేవు. కర్ణాటకలో పెద్ద మొత్తంలో టార్గెట్ ఉండటం.. ఇప్పటికీ యాభై శాతం రికవరీ చేయకపోవడంతో నష్టాలు చవిచూసేలా కనిపిస్తోంది. తమిళం, కేరళ, హిందీ, ఓవర్సీస్ అన్ని చోట్ల సైరా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉండటంతో టార్గెట్‌ను చేరుకోలేకపోతోంది.

మరోవైపు వార్ దూకుడు...
హిందీలో
సైరాను
రిలీజ్
చేసినా..
వార్
దూకుడు
ముందు
నిలవలేకపోయింది.
హృతిక్
రోషన్,
టైగర్
ష్రాఫ్
లాంటి
హీరోలు,
అబ్బురపరిచే
యాక్షన్
ఎపిసోడ్స్
ఉండటంతో
ఈ
మూవీ
బాక్సాఫీస్
వద్ద
దూసుకుపోతోంది.
ఇప్పటికీ
ఈ
చిత్ర
వసూళ్లు
నిలకడగానే
ఉన్నాయి..
త్వరలోనే
మూడు
వందల
కోట్ల
క్లబ్‌లోకి
చేరుతుందని
ట్రేడ్
విశ్లేషకులు
భావిస్తున్నారు.