సైరాకు అడ్డు నైరా.. మూడో రోజూ కలెక్షన్ల జోరు.. దూసుకుపోతున్న మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బాక్సాఫీస్ కలకలలాడాల్సిందే. ఒకప్పుడు చిరు సినిమాకు టికెట్లు సంపాదించాలంటే.. బట్టలు చిరగాల్సిందే. అంత పెద్ద క్యూలైన్లను దాటుకుని పోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే మారిన ట్రెండ్ ప్రకారం.. బుక్ మై షో లాంటి యాప్ లోకిల్లి ఈజీగానే బుక్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి వాటిల్లో కూడా సైరా టిక్కెట్లు దొరకడం లేదంటేనే చిరు మేనియా అర్థమవుతోంది..

రీ ఎంట్రీతోనే వంద కోట్లను దాటేసిన చిరు..
దాదాపు దశాబ్దం పాటు సినీ రంగానికి దూరమైన చిరు.. ఖైదీ నెంబర్ 150తో అభిమానులను పలకరించాడు. సినీ రంగానికి దూరమైన ఆ గ్యాప్లోనే ట్రెండ్ కూడా మారిపోయింది. సినీ పరిశ్రమలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ చిరుకు ఉన్న ఇమేజ్, మెగాస్టార్ అంటే అభిమానుల్లో ఉన్న ప్రేమ మాత్రం ఏ మార్పు చెందలేదు. రీఎంట్రీతోనే 150 కోట్లు కొల్లగొట్టేశాడు.

కేవలం రెండు రోజుల్లోనే వందకోట్ల గ్రాస్..
అత్యంత భారీ ఎత్తున నిర్మించి, విడుదల చేసిన సైరా.. అదే రేంజ్లో వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ ను రాబట్టి మెగాస్టార్ స్టామినా చూపించగా.. రెండో రోజుతో వందకోట్లను క్రాస్ చేసి 110 కోట్లను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

మూడో రోజూ అప్రతిహతంగా..
నాన్ హాలిడే రోజు రిలీజ్ అయినా ఈ మూవీ వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. లాంగ్ వీకెండ్ ను వాడుకుంటోన్న సైరా.. మూడో రోజు కూడా దుమ్ములేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 133 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 97 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు తెలుస్తోంది. ఇండియాలో మూడో రోజు.. దాదాపు 20 కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం.
Recommended Video

వీకెండ్, దసరా సెలవులు..
వీకెండ్, దసరా సెలవులను వాడుకోనున్న సైరా.. పెద్ద మొత్తంలో రాబట్టనున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వీకెండ్, దసరా ముగిసే సరికి ఈ మూవీ మొత్తం రాబట్టేస్తుందని అంటున్నారు. మరి సైరా ఇంకా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగ రాసింది. మరి దసరా సెలవులను వాడుకోనున్న సైరా.. ఇంకెన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











