Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Veera Simha Reddy Vs Waltair Veerayya యూఎస్ అడ్వాన్స్ బుకింగ్ నువ్వా? నేనా? తొలిసారి చిరుపై బాలయ్య అధిక్యం!
టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండగ ప్రేక్షకులకు నిజమైన పండగను తీసుకురాబోతున్నది. ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, తమిళ ఇళయదళపతి విజయ్, సూపర్ స్టార్ అజిత్ ఈ సంక్రాంతి బరిలో నువ్వా? నేనా అనేది తేల్చుకోబోతున్నారు. అయితే ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్ 15 రోజుల ముందుగానే అమెరికాలో ఓపెన్ అయింది. ఈ నాలుగు సినిమాల రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి 2023 బరిలో నలుగురు
సంక్రాంతి 2023 రిలీజ్ విషయానికి వస్తే.. అజిత్ నటించిన తణివు (తెలుగులో తెగింపు) జనవరి 11వ తేదీన, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన, విజయ్ నటించిన వారిసు (తెలుగులో వారసుడు) జనవరి 12వ తేదీన, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే నలుగురు స్టార్ హీరోలు కావడంతో ఈ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై భారీ క్రేజ్ నెలకొన్నది.

ఒకే బ్యానర్‌లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి
తెలుగు సినిమాల రిలీజ్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందాయి. ఈ రెండు చిత్రంల్లోనూ శృతిహాసన్ హీరోయిన్. ఈ రెండు చిత్రాల టైటిల్స్‌లో వీర అనే పదం కామన్‌గా ఉండటం, ఈ రెండు సినిమాల దర్శకులు ఇద్దరి హీరోల అభిమానులే కావడం ఈ రెండు చిత్రాలపై అంచనాలు పెంచేశాయి.

ప్రిస్టేజ్‌గా నందమూరి, మెగా ఫ్యాన్స్
గత సంక్రాంతి పండుగల సమయంలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ అనివార్యమైంది. అయితే ఇద్దరు తమ సినిమాలను సంక్రాంతి రోజున విడుదల చేసి హిట్లు కొట్టారు. కొన్నిసార్లు బాలకృష్ణ హిట్టు కొడితే.. మరికొన్నిసార్లు చిరంజీవి హిట్లు కొట్టారు. గతానికి ఇప్పడున్న పరిస్థితులకు పోల్చితే.. ప్రస్తుతం వాతావరణం డిఫరెంట్‌గా ఉంది. ఈ సంక్రాంతికి హిట్టు కొట్టడమనేది చిరంజీవి, బాలకృష్ణ అభిమానులకు ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది.

6 షోలు వారం రోజులపాటు
వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, వీరసింహారెడ్డితో బాలకృష్ణ వస్తున్నందున్న టికెట్ల రేట్లను పెంచి ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకొనేందుకు మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. ప్రతీ రోజు 6 షోలు వారం రోజులు ప్రదర్శించేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం చేసుకొంటున్నది. ఈ మేరకు నిర్మాతలు ప్రభుత్వ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే టికెట్ రేట్‌ను ప్రస్తుత ధరకు 50 రూపాయలు అదనంగా పెంచుకొనే అవకాశం ఇవ్వమని కోరేందుకు సిద్దమైనట్టు సమాచారం.

అమెరికాలో వీరసింహారెడ్డి రచ్చ
అమెరికాలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ఒపెన్ అయ్యాయి. తాజా వార్తల ప్రకారం.. అమెరికాలో వీర సింహారెడ్డి చిత్రాన్ని 182 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీరసింహారెడ్డి 4500 టికెట్లు అమ్ముడవ్వగా.. 83K డాలర్లు అంటే.. 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ది బెస్ట్ ఓవర్సీస్‌గా చెప్పుకోవచ్చు.

అడ్వాన్సు బుకింగ్‌లో తగ్గని వాల్తేరు వీరయ్య
ఇక వాల్తేరు వీరయ్య అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. చిరంజీవి సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌ను స్లోగా ప్రారంభించారు. ఈ సినిమాను 163 షోలను కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 3150 టికెట్లు అమ్ముడవ్వడగా.. 62K డాలర్లు అంటే 50 లక్షల రూపాయలకుపైగా వసూలు చేసింది. కొద్ది రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఓవర్సీస్‌లో పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

ఫస్ట్ టైమ్ బాలయ్య టాప్
ఓవర్సీస్‌లో వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డికి భారీ రెస్పాన్స్ లభిస్తున్నట్టు అడ్వాన్స్ బుకింగ్ చూస్తే స్పష్టమవుతున్నది. తొలిసారి బాలకృష్ణ అమెరికాలో భారీగా వసూళ్లను రాబట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో వాల్తేరు వీరయ్య సినిమా వెనుకబడినట్టు కనిపిస్తున్నది. అయితే ఈ బాక్సాఫీస్ పోరులో చిరంజీవి, బాలకృష్ణలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది.