Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Chiranjeevi vs Balakrishna యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్ రచ్చ.. వీరయ్యను మించిన వీర సింహారెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు కోడి పందేలా కంటే సినిమాల అలజడి ఎక్కువగా వినిపిస్తుందా? అనిపిస్తున్నది. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, ఇళయదళపతి విజయ్, సూపర్ స్టార్ అజిత్ కుమార్ దూకేందుకు రెడీగా ఉన్నారు. ఈ నలుగురు సూపర్ స్టార్స్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా మొదలయ్యాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

తెలుగు ప్రేక్షకులకు హై ఫీవర్
తెలుగు సినిమా ప్రపంచంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల ఫీవర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఖండాంతరాలను దాటింది. ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల టీజర్లు, ట్రైలర్, సినిమా పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియా, య్యూట్యూబ్‌లో రికార్డులతో సందడి చేస్తున్నాయి.

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్
సంక్రాంతి 2023 బరిలో రిలీజ్ అయ్యే వీర సింహరెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు చిత్రాల అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాల్లో మొదలు కాలేదు. కానీ అమెరికా, యూకే, ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో గత మూడు రోజుల క్రితమే అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నాలుగు చిత్రాలకు మంచి రెస్సాన్స్ లభిస్తున్నది.

100K డాలర్లతో బాలయ్య
ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నది. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ నటిస్తున్నారు. అయితే అమెరికాలో ఈ చిత్రం 86 లోకేషన్లలో 210 షోల కోసం 5200 టికెట్లు అమ్ముడుపోవడం ద్వారా 100K డాలర్లు అంటే సుమారు 83 లక్షల రూపాయలు వసూలు చేసింది.

వాల్తేరు వీరయ్యకు మంచి క్రేజ్
అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో కూడా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా చిత్రం అమెరికాలో 73 లోకేషన్లలో 188 షోల ద్వారా 4200 టికెట్లు అమ్మడం ద్వారా 82K డాలర్లు అంటే 68 లక్షలు వసూలు చేసింది.

విజయ్, అజిత్ మధ్య హోరా హోరీగా
ఇక అమెరికాలో విజయ్ నటించిన వారిసు (వారసుడు తెలుగులో) మంచి రెస్సాన్స్ కూడగట్టుకొంటున్నది. వారిసు చిత్రం 80 లోకేషన్లలో 189 షోల ద్వారా 62K డాలర్లు వసూలు చేసింది. ఇక అజిత్ సినిమా విషయానికి వస్తే.. 77 లోకేషన్లల్లో 147 షోల ద్వారా 35K డాలర్లు వసూలు చేసింది.
ఇక బ్రిటన్ విషయానికి వస్తే.. వారిసు 97 లోకేషన్లలో 145 షోల కోసం 6500 టికెట్లు అమ్ముడుపోయాయి. అలాగే తనివు (తెలుగులో తెగింపు) చిత్రం 57 లొకేషన్లలో, 57 షోల ద్వారా 2000 టికెట్లు అమ్ముడయ్యాయి.