Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి రికార్డును కొట్టలేకపోయిన బాలకృష్ణ!
సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్ర హీరోల చిత్రాలు పోటీ పడటం సహజంగానే కనిపిస్తాయి. అయితే అలాంటి సినిమాలు వచ్చిన ఫ్యాన్స్‌లో పోలీకలు ఉండటంతో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉంటుంది. అయితే అగ్ర హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు వస్తున్నప్పుడు అభిమానులు రికార్డులు బయటపెట్టి తమ కథానాయకుల అధిపత్యాన్ని చాటుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. గతంలో కూడా చిరు, బాలయ్య సినిమాల ఒకదానికి మరోకటి పోటీపడినప్పుడు గట్టిగానే ఫ్యాన్ వార్ జరిగింది. అయితే మరోసారి నెల రోజుల వ్యవధిలో ఇద్దరు హీరోల సినిమాలు వస్తుండటంతో ఈ తరహా చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నది. ఆ ఫ్యాన్ వార్, లెక్కల వివరాల్లోకి వెళితే..
2025 సంవత్సరాంతం, అలాగే 2026 ఏడాది ఆరంభం బాక్సాఫీస్ పెద్ద హీరోల సినిమాలతో దద్దరిల్లబోతున్నది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా అఖండ 2, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రాలు రిలీజ్‌కు సిద్దం కావడంతో క్రిస్మస్, సంక్రాంతి పండుగలు ముందే వచ్చాయనేంతగా సంబర పడిపోతున్నారు. అయితే ఫ్యాన్స్ అసోసియేషన్స్ తమ హీరోల చిత్రాల గొప్పతనాన్ని ఎవరికి వారే చాటుకోబోతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోల సినిమా స్టాండర్డ్ చెప్పుకోవడానికి నైజాంలో జరిగిన బిజినెస్‌నే ప్రామాణికంగా తీసుకొంటారు. అక్కడ జరిగే బిజినెస్‌ను స్టార్ హీరోల స్టామినాగా ఫ్యాన్స్ ఘనంగా చెప్పుకొంటారు. అయితే బాలయ్య, చిరంజీవి సినిమాల విషయంలో జరిగిన బిజినెస్ విషయంలో ఈ చర్చ సోషల్ మీడియాలో ఊపందుకొన్నాయి.

ఇదిలా ఉండగా, నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన అఖండ 2 తాండవం చిత్రం డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చిరంజీవి, అనిల్ రావిపూడి తొలిసారి కలిసి చేస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటాయి.
ఇక అఖండ, మన శంకర వరప్రసాద్ సినిమాల నైజాం బిజినెస్ విషయానికి వస్తే.. అఖండ చిత్రం థియేట్రికల్ రైట్స్ నైజాంలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక చిరంజవి సినిమా అంతకు మించి రికార్డు స్థాయిలో 32 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఇటీవల కాలంలో సరైన హిట్టు లేకపోయినా చిరంజీవి స్టామినాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని స్పష్టం అయింది.
మెగా స్టార్, గాడ్ ఆఫ్ మాసెస్‌గా పేర్కొనే ఇద్దరు సినిమాల బిజినెస్ విషయంలో ఇరు వర్గాల ఫ్యాన్స్‌లో వార్ మొదలైంది. మా హీరో రేంజ్ అంటూ ఒకరికొకరు కామెంట్స్ చేసుకొంటున్నారు. ఈ ఇద్దరు హీరోల మధ్య ఫ్యాన్ వార్ ఏ రేంజ్‌కు చేరుతుందనే ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











