»   » మహేష్, పవన్‌తో నష్టం: రజనీ వచ్చి చిరుకి హెల్ప్, వర్కౌట్ అయ్యేనా?

మహేష్, పవన్‌తో నష్టం: రజనీ వచ్చి చిరుకి హెల్ప్, వర్కౌట్ అయ్యేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓవర్సీస్ మార్కెట్లో కొన్నేళ్లుగా తెలుగు సినిమాల మార్కెట్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు నైజాం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించే టెర్రిటరీగా ఓవర్సీస్ మార్కెట్ మారింది. దీంతో ఈ మార్కెట్‌ను దక్కించుకోవడానికి చాలా మంది తెలుగు స్టార్స్ పోటీ పడుతున్నారు.

ఓవర్సీస్ మార్కెట్లో చాలా కాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న తెలుగు హీరోలు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు మహేష్ బాబు. చాలా కాలంగా వీరిద్దరి సినిమాలు మాత్రమే ఇక్కడ భారీ వసూళ్లు సాధిస్తూ వస్తున్నాయి. అందుకు కారణం ఈ ఇద్దరు హీరోలపై ఎన్నారై ప్రేక్షకులకు ఉన్న అభిమానమే. అయితే బాహుబలి వచ్చి వీరిద్దరినీ వెనక్కి నెట్టేసింది.

బాహుబలి ఒక ప్రత్యేకమైన సినిమా కాబట్టి ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను... రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోల్చడం తగదు. ఓవర్సీస్‌ మార్కెట్లో రారాజులు ఎవరంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పక తప్పదు. అందుకే ఈ ఏడాది కూడా వీరి సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.

సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని ఓ బయ్యర్ రూ. 10.5 కోట్లకు కొనుగోలు చేయగా, బ్రహ్మోత్సవం చిత్రాన్ని ఏకంగా రూ. 13కోట్లకు కొనుగోలు చేసారు. అయితే ఈ రెండు సినిమాలు భారీ ప్లాపులు కావడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి.

ఇలాంటి నష్ట పరిస్థితుల నేపథ్యంలో అసలు ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్ లేని చిరంజీవి చేస్తున్న 150వ మూవీకి భారీ ఆఫర్ వస్తుందనే ఊహ కూడా ఎవరూ చేయరు. పైగా ఈ మధ్య కాలంలో పెద్దగా ఫాంలో లేని వివి వినాయక్ దర్శకత్వం కావడం కూడా ఓ కారణం.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

రజనీకాంత్

రజనీకాంత్

అయితే ఇటీవల వచ్చిన రజనీకాంత్ ‘కబాలి' సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో భారీ హైప్ వచ్చింది.

భారీ లాభాలు

భారీ లాభాలు

ఈ సినిమాను ఓవర్సీస్ బయ్యర్ రూ. 8.5 కోట్లకు కొననగా ఇప్పటికే 4 మిలియన్ డాలర్స్(రూ. 26.8 కోట్లు) వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈచిత్రం ఓవర్సీస్ 5 మిలియన్ డాలర్లు(రూ. 33.5 కోట్లు) చేస్తుందని అంచనా. భారీ లాభాలతో బయ్యర్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

చిరంజీవికి అంతే..

చిరంజీవికి అంతే..

తమిళంలో రజనీకాంత్‌కు ఎంత క్రేజ్ ఉందో... తెలుగులో చిరంజీవికి అంతే క్రేజ్ ఉంది. ఆయన చేస్తున్న కమ్ బ్యాక్ మూవీ కాబట్టి ‘కబాలి' మాదిరిగానే చిరు 150కి రిలీజ్ ముందే భారీ హైప్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

భారీ ఆఫర్

భారీ ఆఫర్

ఈ నేపథ్యంలో చిరంజీవి 150వ సినిమా ఓవర్సీస్ రైట్స్ దక్కించుకునేందుకు ఓ బయ్యర్ రూ. 12 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

క్యాష్ చేసుకోవచ్చు..

క్యాష్ చేసుకోవచ్చు..

ఒక వేళ చిరంజీవి 150వ సినిమా రిలీజ్ తర్వాత అంచనాలు అందుకోక పోయినా... కేవలం చిరంజీవి 150వ సినిమా అనే హైప్ ను క్యాష్ చేసుకోవచ్చని సదరు బయ్యర్ భావిస్తున్నాడు. రజనీకాంత్ కబాలి విషయంలో జరిగింది కూడా ఇదే.

కబాలికి అలానే..

కబాలికి అలానే..

కబాలి రిలీజ్ ముందు భారీ హైప్ ఉంది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంత విషయం లేదని తేలిపోయింది. అయితే కేవలం రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ వల్లే సినిమా రిలీజ్ ముందే భారీగా ప్రీమియర్ షోలు వేసి భారీ ధరలకు టిక్కెట్లు అమ్మినా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారీగా లాభాలు వచ్చాయి.

వర్కౌట్ అయ్యేనా?

వర్కౌట్ అయ్యేనా?

ఇదే ఫార్ములాను బేస్ చేసుకుని ఇపుడు చిరంజీవి 150వ సినిమాను కొనుగులో చేయడానికి బయ్యర్లు పోటీ పడుతున్నారు. అయితే అన్ని సమయాల్లోనూ ఇలానే వర్కౌట్ అవుతుందని చెప్పలేం. మరి ఏం జరుగుతుందో చూద్దాం...

English summary
As per sources a distributor has offered 12 crore for overseas distribution rights of Chiranjeevi’s upcoming 150th film. Distributors are expecting Chiru’s 150 to have tremendous pre release buzz as it is Megastar’s reentry movie. But 12 crore is a huge amount to recover if the film fails to live up to expectations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu