మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి చిత్రం చిరుత శనివారం(జనవరి 5, 2008)తో 100 రోజులను పూర్తి చేసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విశ్లేషకుల ప్రశంసలు పొందలేకపోయినప్పటికీ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంది. పాటలలో, ఎమోషనల్ సీన్లలో చరణ్ ఈజీగా నటించడం ప్రశంసలు పొందింది. కాగా చిరుత చిత్రం మొత్తంగా 38 సెంటర్లలో 100 రోజులను పూర్తి చేసుకుంది. అర్థ శతదినోత్సవాన్ని సింగపూర్ లో జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ శతదినోత్సవాన్ని వైజాగ్ లో జరుపుకోవాలనే ఆలోచనలో ఉంది. కాగా చరణ్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.
Story first published: Thursday, April 23, 2026, 7:20 [IST]