చిరుత అర్థసెంచరీ
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ తెరంగేట్రం చేసిన చిరుత సినిమా విడుదలై 50 రోజులను పూర్తి చేసుకుంది. నైజాం ఏరియాలో 30 థియేటర్లలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 12, తూర్పు గోదావరి జిల్లాలో 12, గుంటూరు జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 16, నెల్లూరు జిల్లాలో 16, సీడెడ్ ఏరియాలో 48, వైజాగ్ జిల్లాలో 19 థియేటర్లలో, కర్నాటకలో 5, చెన్నయ్ లో1, ఒరిస్సాలో 3, మహారాష్ట్ర 1, కృష్ణా జిల్లాలో 3. మొత్తంగా 202 థియేటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుంది. చిరుత సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో రూ.25.49 కోట్లు షేర్ వసూళు చేసింది. ఈ సినిమా నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.9.30 కోట్లు వసూళు చేయగా, రాయలసీమలో రూ.5.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.55 కోట్లు, మిగతా ప్రాంతాలలో దాదాపు రూ.7 కోట్ల షేర్ వసూళు చేసింది.


Click it and Unblock the Notifications











