2 డేస్ రిపోర్ట్: ‘చిత్రలహరి’ టాక్ ఒకే.. కానీ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి?
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'చిత్రలహరి'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుసగా 6 ప్లాపుల తర్వాత సాయి ధరమ్ తేజ్ మూవీకి గుడ్ వినిపించింది.
బాక్సాఫీసు బరిలో గతవారం విడుదలైన 'మజిలీ' తప్ప పెద్దగా పోటీనిచ్చే సినిమాలేవీ లేవు. దీంతో 'చిత్రలహరి'కి వసూళ్ల పరంగా కలిసొచ్చింది. తొలి రోజు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే రివ్యూ రిపోర్ట్స్ అనుకూలంగా ఉండటంతో మూవీ టీం ఊపిరి పీల్చుకుంది.

తొలి రోజు ఏపీ, తెలంగాణ కలెక్షన్
‘చిత్రలహరి' తొలి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి రూ. 3.02 కోట్ల షేర్ వసూలు చేసింది. వరుస ప్లాపుల్లో ఉన్న ఈ సుప్రీం హీరోకు ఫస్ట్ డే తెలుగురాష్ట్రాల్లో ఇంత షేర్ రావడం అంటే మంచి ఫిగరే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

సెకండ్ డే కాస్త డాప్ర్
తొలి రోజుతో పోలిస్తే ‘చిత్రలహరి' బాక్సాఫీసు కలెక్షన్లు రెండోరోజు కాస్త డ్రాప్ అయ్యాయి. సెకండ్ డే శనివారం రూ. 2.36 కోట్లు రాబట్టింది. కానీ తొలి రోజుతో పోలిస్తే నైజాం ఏరియాలో రెండోరోజు వసూళ్లు బాగా పెరిగాయి.

ఏరియా వైజ్ 2 డేస్ రిపోర్ట్
నైజాం రూ. 1.65 కోట్లు, సీడెడ్ రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 77 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 58 లక్షలు, కృష్ణ రూ. 41 లక్షలు, గుంటూరు రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 37 లక్షలు, నెల్లూరు రూ. 22 లక్షలు.... ఏపీ-తెలంగాణ కలిపి రెండు రోజుల్లో రూ. 5.38 కోట్ల షేర్ రాబట్టింది.

లాభం రావాలంటే..
ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 13 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల రైట్స్ రూ. 10.40 కోట్లకు అమ్మగా... ఇప్పటి వరకు రూ. రూ. 5.38 కోట్ల వసూలు చేసింది. లాభాలు రావాలంటే... అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











