twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cobra 3 Days Collections: తెలుగులో కోబ్రాకు బిగ్ షాక్.. 3 రోజుల్లో ఇలా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

    |

    పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు చియాన్ విక్రమ్. మరీ ముఖ్యంగా తెలుగులోనూ అదిరిపోయే ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి తన అన్ని చిత్రాలనూ మన భాషలో కూడా విడుదల చేస్తూ ముందుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విక్రమ్ 'కోబ్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    తెలుగులో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక, ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే, ఫస్ట్ డే మాత్రం కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, తర్వాత వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'కోబ్రా' మూవీ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూద్దాం పదండి!

    కోబ్రాగా విక్రమ్ నట విశ్వరూపం

    కోబ్రాగా విక్రమ్ నట విశ్వరూపం

    చియాన్ విక్రమ్ - ఆర్ అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'కోబ్రా'. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇక, ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు.

    బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

    కోబ్రా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    కోబ్రా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో తమిళంలో దాదాపు రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ అయింది.

    3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

    3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

    'కోబ్రా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజు వసూళ్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ వసూలైంది.

    ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షోప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

    3 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

    3 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

    'కోబ్రా' మూవీకి మూడు రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 93 లక్షలు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.12 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

    టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

    విక్రమ్ హీరోగా చేసిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.12 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.88 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ అందుకుంటుంది.

    వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

     ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

    క్రేజీ సబ్జెక్టుతో వచ్చిన 'కోబ్రా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగానూ మంచి స్పందనే వచ్చింది. 3 రోజుల్లో తమిళనాడులో రూ. 20.70 కోట్లు, కర్నాటకలో రూ. 5.25 కోట్లు, కేరళలో రూ. 2.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.60 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.10 కోట్లు గ్రాస్, రూ. 19.40 కోట్లు షేర్ వసూలు అయింది.

    ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్

    ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 61 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 19.40 కోట్లు వచ్చాయి. అంటే మరో 41.60 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

    English summary
    Kollywood Star Vikram Did Cobra Movie Under R. Ajay Gnanamuthu Direction. This Movie Collects Rs 3.12 CR in Telugu States in 3 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X