Cobra 4 Days Collections: కోబ్రాకు ఊహించని వసూళ్లు.. 5 కోట్లకు అమ్మితే.. నాలుగు రోజుల్లోనే!

విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో చియాన్ విక్రమ్. కోలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాది భాషలు అన్నింట్లోనూ తన మార్కెట్‌ను పెంచుకున్న అతడు.. దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపును అందుకున్నాడు. దీంతో ఏజ్ పెరుగుతోన్నా ఏమాత్రం తగ్గకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోన్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే విక్రమ్ 'కోబ్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక, ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కోబ్రా' మూవీ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే చూడండి!

కోబ్రాగా ఎంట్రీ ఇచ్చేసిన విక్రమ్

కోబ్రాగా ఎంట్రీ ఇచ్చేసిన విక్రమ్

చియాన్ విక్రమ్ హీరోగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన చిత్రమే 'కోబ్రా'. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

కోబ్రా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

కోబ్రా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

చియాన్ విక్రమ్ 'కోబ్రా' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో తమిళంలో దాదాపు రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ చేసింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

'కోబ్రా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజు వసూళ్లు కాస్త పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలైంది.

 4 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

4 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

'కోబ్రా' మూవీకి 4 రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 59 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 31 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.37 కోట్లు షేర్, రూ. 5.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.00 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.37 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.63 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ అందుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

విభిన్నమైన సబ్జెక్టుతో వచ్చిన 'కోబ్రా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగానూ మంచి స్పందనే వచ్చింది. 4 రోజుల్లో తమిళనాడులో రూ. 24.80 కోట్లు, కర్నాటకలో రూ. 3.50 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.00 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 42.75 కోట్లు గ్రాస్, రూ. 22.45 కోట్లు షేర్ వసూలు అయింది.

ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్

ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్

విక్రమ్ - అజయ్ జ్ఞానముత్తు కాంబోలో వచ్చిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 61 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 22.45 కోట్లు వచ్చాయి. అంటే మరో 38.55 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X