Cobra 5 Days Collections: కోబ్రాకు పెరిగిన వసూళ్లు.. 5 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!
దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా హీరోగా వెలుగొందుతూ తనదైన చిత్రాలతో దక్షిణాదిలోని ప్రేక్షకులను అలరిస్తోన్న హీరో చియాన్ విక్రమ్. పేరుకు తమిళ హీరోనే అయినా అన్ని భాషల్లోనూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక, చాలా కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న చియాన్ విక్రమ్ ఇటీవలే 'కోబ్రా' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కోబ్రా' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఓవరాల్‌గా 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

కోబ్రాగా ఎంటర్ అయిన విక్రమ్
చియాన్ విక్రమ్ - ఆర్ అజయ్ జ్ఞానముత్తు కలయికలో రూపొందిన చిత్రమే 'కోబ్రా'. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లెజెండరీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను ఇచ్చారు.

కోబ్రా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో తమిళంలో దాదాపు రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ చేసింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ అయింది.

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
ఆంధ్రా, తెలంగాణలో 'కోబ్రా' మూవీకి 5వ రోజు వసూళ్లు కాస్త పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 31 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వసూలైంది.

5 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
5 రోజుల్లో 'కోబ్రా' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.68 కోట్లు షేర్, రూ. 6.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా... ఎంత రావాలి?
చియాన్ విక్రమ్ 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.68 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.32 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కోబ్రా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగానూ మంచి స్పందనే వచ్చింది. 5 రోజుల్లో తమిళనాడులో రూ. 29.10 కోట్లు, కర్నాటకలో రూ. 3.85 కోట్లు, కేరళలో రూ. 2.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 48.45 కోట్లు గ్రాస్, రూ. 25.55 కోట్లు షేర్ వసూలు అయింది.

ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 61 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 25.55 కోట్లు వచ్చాయి. అంటే మరో 35.45 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











