Cobra 6 Days Collections: 6వ రోజు విక్రమ్​ కోబ్రాకు తగ్గిన వసూళ్లు.. ఇంకెంత రావాలంటే?

తనదైన నటనా కౌశల్యంతో ఆద్యంతం ఎంటర్​టైన్​ చేస్తూ వస్తున్నాడు చియాన్ విక్రమ్​. విభిన్నమైన కథలతో, పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు విక్రమ్. పేరుకు విక్రమ్ కోలీవుడ్ హీరో అయినప్పటికీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. వివిధ రాష్టాల్లోనూ మార్కెట్​ను, ఫాలోయింగ్​ను పెంచుకుంటూ పోతున్నాడు విక్రమ్. అయితే డిఫరెంట్​ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విక్రమ్​కు చాలా ఏళ్ల నుంచి సరైన విజయం దక్కలేదు. ఇలాంటి సమయంలో కోబ్రాగా పలకరించాడు. మరి ఇటీవల విడుదలైన ఈ మూవీ 6 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దామా!

అంజలి సీబీఐ, డిమోంటీ కాలనీ చిత్రాల దర్శకుడు ఆర్​ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్​లో చియాన్ విక్రమ్​ హీరోగా తెరకెక్కిన మూవీ కోబ్రా. సెవెన్​ స్క్రీన్​ స్టూడియో బ్యానర్​పై ఎస్​ఎస్​ లలిత్​ కుమార్​ నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్​ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటించిన విషయం తెలిసిందే.

 కోబ్రా చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్

కోబ్రా చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్

విక్రమ్, శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, ఇర్ఫాన్​ నటించిన 'కోబ్రా' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో తమిళంలో దాదాపు రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ చేసింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ అయింది.

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా..

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా..

ఆంధ్రా, తెలంగాణలో 'కోబ్రా' మూవీకి 6వ రోజు వసూళ్లు కాస్త భారీగానే తగ్గినట్లు తెలుస్తోంది. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్ష, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 13 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వసూలైంది.

6 రోజులకూ కలిపి వచ్చింది ఎంతంటే?

6 రోజులకూ కలిపి వచ్చింది ఎంతంటే?

6 రోజుల్లో 'కోబ్రా' మూవీకి రెస్పాన్స్ బాగానే ఉంది. ఈ ఫలితంగా నైజాంలో రూ. 1.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.81 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

చియాన్ విక్రమ్ 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.81 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.19 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ అందుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా ఉన్నాయి..

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా ఉన్నాయి..

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కోబ్రా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగానూ మంచి స్పందనే వచ్చింది. 6 రోజుల్లో తమిళనాడులో రూ. 30.05 కోట్లు, కర్నాటకలో రూ. 3.95 కోట్లు, కేరళలో రూ. 2.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.45 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 50.05 కోట్లు గ్రాస్, రూ. 26.40 కోట్లు షేర్ వసూలు అయింది.

ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్

ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 61 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 26.40 కోట్లు వచ్చాయి. అంటే మరో 34.6 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X