For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cobra 1st Week Collections: అన్ని వైపులా నష్టాలే.. ఏడవ రోజు మరీ దారుణంగా..

    |

    టాలెంటెడ్ హీరో విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా పోస్టర్స్ తోనే విక్రమ్ భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేశాడు. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. కానీ సినిమా కంటెంట్ పరంగా మాత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

    ఇక ఓపెనింగ్స్ బాగానే అందుకున్నప్పటికీ ఆ తర్వాత వసూళ్లు డౌన్ అయ్యాయి. దాదాపు అన్ని ఏరియాలో కూడా నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక మొత్తానికి ఈ సినిమా వచ్చి వారం రోజులు అయింది. ఇక వారం మొత్తంలో సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఇంకా ఎంత రావాలి అనే వివరాల్లోకి వెళితే..

    కోబ్రా చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్

    కోబ్రా చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్

    'కోబ్రా' సినిమాకు విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బిజినెస్ కూడా గట్టిగానే చేసింది. తమిళంలో రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ తో కోబ్రా సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ చేసింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం.

    7వ రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్

    7వ రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్

    రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కోబ్రా' సినిమా రెండవ రోజు నుంచే వసూళ్లు ఒక్కసారిగా తగ్గుతూ వచ్చాయి. ఇక 7వ రోజు కూడా చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్ష, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు రాగా మిగతా ఏరియాల నుంచి మరో రెండు లక్షలు వచ్చాయి. దీంతో ఆంధ్ర తెలంగాణలో రూ. 7 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.

    ఫస్ట్ వీక్ మొత్తం కలెక్షన్స్

    ఫస్ట్ వీక్ మొత్తం కలెక్షన్స్

    మొదటి వారానికి వచ్చేసరికి 'కోబ్రా' సినిమా రెండు రాష్ట్రాల్లో మొత్తంగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 1.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 44 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 66 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 37 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.88 కోట్లు షేర్, రూ. 6.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 6.65 కోటు రాగా తమిళనాడులో రూ. 30.70 కోట్లు, కర్నాటకలో రూ. 4.05 కోట్లు, కేరళలో రూ. 2.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.55 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 51.10 కోట్లు గ్రాస్, రూ. 26.95 కోట్లు షేర్ వసూలు అయింది.

    వచ్చింది ఎంత.. రావాల్సింది ఎంత?

    వచ్చింది ఎంత.. రావాల్సింది ఎంత?

    'కోబ్రా' సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్లు మేర బిజినెస్ చేయగా మొదటి వారంలో రూ. 3.88 కోట్లు షేర్ వసూళ్లను అందుకుంది. అంటే మరో 1.12 కోట్ల షేర్ వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ అందుకుంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా చేసుకుంటే.. 60 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 61 కోట్లుగా నమోదైంది.

    7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 26.40 కోట్లు వచ్చాయి. అంటే మరో 34.6 కోట్లు వస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క. కానీ సినిమా మళ్ళీ పుంజుకోవడం కష్టమే. దాదాపు అన్ని ఏరియాల్లో కూడా కోబ్రా సినిమాకు నష్టాలు వచ్చినట్లే లెక్క.

    English summary
    Chiyaan Vikram Cobra Movie 7 Days World Wide Box Office Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X