Cobra Day 1 Collections: తెలుగులో కోబ్రా సంచలనం.. ఒక్కరోజే అన్ని కోట్లు.. టోటల్‌గా ఎంతంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అక్కడి మూవీలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యంగా ముందుకు వచ్చి పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన సినిమానే 'కోబ్రా'. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతోన్న విక్రమ్ నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో 'కోబ్రా'కు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే చూడండి!

కోబ్రాగా విక్రమ్ నట విశ్వరూపం
చియాన్ విక్రమ్ హీరోగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన చిత్రమే 'కోబ్రా' ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు చేసిన విషయం తెలిసిందే.

కోబ్రా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
'కోబ్రా' మూవీపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే తమిళంలో దాదాపు రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాలు కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

ఓవరాల్‌గా అలాంటి టాక్‌తోనే
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ 'కోబ్రా' బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగులో కూడా అలాంటి టాకే దక్కింది. దీంతో ఈ సినిమా కూడా అనుకున్నట్లుగా కలెక్షన్లను రాబట్టలేదని అంతా అనుకున్నారు. అయితే, సాయంత్రం నుంచి దీనికి స్పందన పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది
'కోబ్రా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 66 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.28 కోట్లు షేర్, రూ. 3.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా... ఎంత రావాలి?
చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి భారీ స్థాయిలో రూ. 2.28 కోట్లు వచ్చాయి. అంటే మరో 2.72 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
క్రేజీ కాంబినేషన్‌లో వినూత్నమైన సబ్జెక్టుతో వచ్చిన 'కోబ్రా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగానూ మంచి స్పందనే వచ్చింది. తొలిరోజు తమిళనాడులో రూ. 12.10 కోట్లు, కర్నాటకలో రూ. 2.15 కోట్లు, కేరళలో రూ. 1.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3.90 కోట్లు వచ్చాయి. వీటితో కలిసి రూ. 24.45 కోట్లు గ్రాస్, రూ. 12.60 కోట్లు షేర్ వసూలు అయింది.

ఓవరాల్‌గా టార్గెట్.. బ్యాలెన్స్
చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 61 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి భారీ స్థాయిలో రూ. 12.60 కోట్లు వచ్చాయి. అంటే మరో 48.40 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











