twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cobra Day 2 Collections: రెండవరోజే ఒక్కసారిగా డౌన్ అయిన కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    ఇండియన్ బెస్ట్ యాక్టర్స్ లిస్టులో విక్రమ్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు నటన కోసం అతను ఎంతగా హార్డ్ వర్క్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నటించగలిగే అతికొద్దీపనలో విగ్రహం ఒకరు అయితే విక్రమ్ చాలా కాలంగా బాక్సాఫీస్ వద్ద తడబడుతున్నాడు ఇక ఈసారి కోబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్ అందుకున్నప్పటికీ కూడా రెండవ రోజు ఒక్కసారిగా డౌన్ అయిపోయింది ఇక మొత్తంగా ఉండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలెక్ట్ చేసింది బ్రేక్ టార్గెట్ పూర్తి చేయాలి అంటే ఇంకా ఎంత రావాలి అనే వివరాలు వెళితే..

    కోబ్రా సినిమాతో..

    కోబ్రా సినిమాతో..

    చియాన్ విక్రమ్ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజెస్ ను సంపాదించుకున్నాడు. అప్పట్లో అతను నటించిన అపరిచితుడు సినిమా తెలుగులో కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత విక్రమ్ ఐ సినిమాతో మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా కోబ్రా సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని రెడీ అయ్యాడు. అజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ విభిన్నమైన క్యారెక్టర్స్ లో కనిపించాడు.

    కోబ్రా ప్రీ రిలీజ్ బిజినెస్

    కోబ్రా ప్రీ రిలీజ్ బిజినెస్

    'కోబ్రా' సినిమా ఉన్న అంచనాలకు తగ్గట్టుగా తమిళంలో దాదాపు రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, విక్రమ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాలు కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

    2వ రోజు నైజాం, ఆంధ్ర కలెక్షన్స్

    2వ రోజు నైజాం, ఆంధ్ర కలెక్షన్స్

    'కోబ్రా' సినిమా ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు 2.28.కోట్ల వరకు ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండవ రోజు ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో సెకండ్ డే రూ. 66 లక్షల షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    ఇక చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 86 లక్షలు, సీడెడ్ 35 లక్షలు, ఉత్తరాంధ్ర 52 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.94 కోట్ల షేర్, రూ. 4.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    విక్రమ్ 'కోబ్రా' సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగానూ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. కానీ మిశ్రమ స్పందన రావడంతో ఆ ప్రభావం రెండవ రోజు చూపించింది. దీంతో రెండు రోజుల్లో తమిళనాడులో రూ. 17.60 కోట్లు, కర్నాటకలో రూ. 2.80 కోట్లు, కేరళలో రూ. 2.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.05 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4.45 కోట్లు వచ్చాయి. వీటితో వరల్డ్ వైడ్ గా కలిసి రూ. 32.85 కోట్లు గ్రాస్, రూ. 17.10 కోట్లు షేర్ వసూలు అయింది.

    ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    తెలుగులో 4.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కోబ్రా రెండు రోజుల్లో 2.94 కోట్ల షేర్ అందుకుంది. ఇంకా 2.06 కోట్లు అందుకుంటే తెలుగులో ప్రాఫిట్ లోకి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 60 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక 61 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ విడుదలైన ఈ సినిమా 2 రోజుల్లో 17.10 కోట్లు అందుకుంది. ఇక ఇప్పుడు మరో 43.90 కోట్లు వస్తేనే కోబ్రా హిట్ అయినట్లు లెక్క.

    English summary
    Kollywood Star Vikram Did Cobra Movie Under R. Ajay Gnanamuthu Direction. This Movie Collects Rs 0.66 in Telugu States in Day 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X