Veera Dheera Soora Day 2 Collection: రెండో రోజూ నిరాశే.. విక్రమ్ మూవీకి షాకిచ్చేలా కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీర ధీర శూర చిత్రం కోర్ట్ చిక్కుల కారణంగా తొలిరోజు విడుదలకు అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీని ప్రభావం సినిమా ఓపెనింగ్స్ మీద గట్టి ప్రభావం చూపాయి. విక్రమ్ కెరీర్‌లోనే అత్యంత దారుణంగా ఓపెనింగ్స్ వచ్చాయి. థియేటర్‌లలో భారీ సినిమాలు ఉన్న సమయంలో టఫ్ ఫైట్ మధ్య ఇలాంటి పరిస్ధితులు విక్రమ్‌కి షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు వీర ధీర శూర పుంజుకుందా? లేక తొలిరోజు మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కొందా చూస్తే..

వీర ధీర శూరలో విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా నటించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత సారథ్యం వహించారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. రంజాన్ కానుకగా మార్చి 27న వీర ధీర శూరను రిలీజ్ చేశారు. కోర్టు పరమైన చిక్కులు ఎదురై మార్నింగ్ , మ్యాట్నీ షోలు రద్దయినా.. సాయంత్రానికి పరిస్ధితులు చక్కబడ్డాయి.

chiyaan vikram s Veera Dheera Soora Day 2 Box Office Collection worldwide report

టీజర్ , ట్రైలర్, విక్రమ్ రస్టిక్ లుక్ కారణంగా వీర ధీర శూర సినిమాపై తమిళ చిత్ర రంగంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తంగలాన్ తర్వాత విక్రమ్ చేస్తున్న సినిమా కావడం కూడా ఇందుకు కారణమైంది. ప్రయోగాల జోలికి పోకుండా పక్కా కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుని ఈ సినిమా చేశారు విక్రమ్. వీర ధీర శూరకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 31 కోట్ల షేర్.. రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ లేకపోవడంతో వీర ధీర శూర కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన విక్రమ్.. రెండో రోజు ఎలాంటి మేజిక్ చేస్తాడోనని ట్రేడ్ పండితులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే పరిస్ధితులు చూస్తే ఏమాత్రం మారినట్లుగా కనిపించలేదు. రెండో రోజు శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 65.6కే టికెట్లు అమ్ముడైనట్లుగా బుక్ మై షో ప్రకటించింది. మొత్తంగా 27 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా గణాంచాలు చెబుతున్నాయి. చెన్నై, పుదుచ్చేరి, దిండిగల్, కొచ్చి, త్రివేండ్రంలో ఆక్యూపెన్సీ బాగుంది.

రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.3.25 కోట్లు రాబట్టినట్లు సాక్‌నిక్. కామ్ వెల్లడించింది. ఆఫ్‌లైన్ బుకింగ్స్‌తో కలిపితే ఈ మొత్తం రూ. 3.50 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా రూ.6.65 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ చిత్రం. ఇప్పటి వరకు అందిన కలెక్షన్స్‌తో కలిపి వీర ధీర శూర చిత్రం తన బడ్జెట్‌లో కేవలం 12 శాతం మాత్రమే రికవరీ సాధించాలని ఉంది. వరుస సెలవులు, ఉగాది, రంజాన్ పండుగలలోనే ఏం చేసినా .. ఈ సీజన్ దాటితే సినిమా పుంజుకోవడం కష్టమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X