Veera Dheera Soora Day 3 Collection: పుంజుకున్న విక్రమ్ .. మూడో రోజు వసూళ్ల జాతర , ఎన్ని కోట్లంటే?
సినిమా కోసం ఎంతో తపించిపోయి, మరెంతో కష్టపడే చియాన్ విక్రమ్‌కు ఈ మధ్య అస్సలు టైం కలిసి రావడం లేదు. ఆయన నటించిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరుస్తున్నాయి. గతేడాది ఎన్నో అంచనాల మధ్య రిలీజైన తంగలాన్ విక్రమ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రయోగాల జోలికి పోకుండా ఆయన చేసిన చిత్రమే వీర ధీర శూర. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది.
ఓటీటీ హక్కులకు సంబంధించిన వివాదంలో కొందరు కోర్టుకెక్కడంతో తొలి రోజు విడుదల విషయంలో డైలమా కొనసాగింది. న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది వీర ధీర శూర. ఈ ఆలస్యం సినిమా వసూళ్లపై ప్రభావం చూపింది. వీర ధీర శూర తొలిరోజు దారుణమైన ఓపెనింగ్స్‌ను రాబట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలు రేసులో ఉండటంతో రెండో రోజూ కూడా విక్రమ్ సినిమా పుంజుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మూడో రోజు వీర ధీర శూర ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :

వీర ధీర శూరలో విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా నటించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందజేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి వీర ధీర శూరకు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వీర ధీర శూరకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 31 కోట్ల షేర్.. రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. తొలిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న వీర ధీర శూర ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు రూ.3.6 కోట్లు వచ్చాయి. తొలి రెండు రోజులు ఉసూరుమనిపించిన ఈ సినిమా .. మూడో రోజు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనని ట్రేడ్ పండితులు ఆసక్తిగా గమనించారు.
తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు వీర ధీర శూరకు బాగానే ఆదరణ దక్కింది. తమిళ్ వెర్షన్‌కు ఓవరాల్‌గా 38.68 శాతం, తెలుగు వెర్షన్‌కు 17.92 శాతం ఆక్యూపెన్సీ అందుకుంది. చెన్నైలో 524 షోలు, బెంగళూరులో 261 షోలు, మధురైలో 107, కోయంబత్తూరులో 174, హైదరాబాద్‌లో 119, విశాఖలో 52 షోలు ప్రదర్శించారు. మూడో రోజు విక్రమ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్‌ను కలుపుకుంటే ఇది రూ. 5.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మూడు రోజులకు కలిపి వీర ధీర శూర చిత్రం రూ.12.15 కోట్ల వసూళ్లు అందుకుంది. ఆదివారం ఉగాది + వీకెండ్, సోమవారం రంజాన్ పర్వదినాల సందర్భంగా ఈ సినిమాకు కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి విక్రమ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











