Veera Dheera Soora Day 4 Collection: విక్రమ్ మాస్ జాతర.. వీర ధీర శూరకు రికార్డ్ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే అరుదైన నటుడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఆయన సినిమాలు చూస్తే నటనను ఆయన తీసుకున్నంత సీరియస్‌గా ఎవరూ తీసుకోరని అనిపిస్తుంది. పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. గంటలకొద్దీ మేకప్ రూమ్‌లో గడపాలన్నా.. కండలు పెంచాలన్నా, కండలు కరిగించాలన్నా విక్రమ్‌కే సాధ్యం. గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎంతో తపిస్తున్నారు విక్రమ్. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన తంగలాన్ బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది.

ఇలాంటి పరిస్ధితుల్లో ఎలాగైన హిట్ కొట్టాలనే పట్టుదలతో విక్రమ్ చేసిన చిత్రమే వీర ధీర శూర. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే న్యాయపరమైన చిక్కుల కారణంగా వీర ధీర శూర విడుదలకు ఇబ్బందులు ఎదురై సాయంత్రానికి గానీ బొమ్మపడలేదు. దీని ప్రభావం కలెక్షన్ల పైనా పడింది. తర్వాత పుంజుకున్న విక్రమ్ .. నాలుగో రోజు ఎన్నికోట్ల కలెక్షన్లు సాధించాడో చూస్తే

chiyaan vikram s Veera Dheera Soora Day 4 Box Office Collection worldwide report

వీర ధీర శూరలో విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా నటించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందజేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వరుస ఫ్లాపులు ఎదురైనా విక్రమ్‌ తన మార్కెట్‌ను నిలబెట్టుకుంటున్నాడు.

వీర ధీర శూరకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 31 కోట్ల షేర్.. రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. తొలి మూడు రోజులు కలిపి వీర ధీర శూర చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కలెక్షన్ల పరంగా మంచి హోల్డ్ చూపిస్తున్నా ఈ సినిమా రికవరీ చేయాల్సిన టార్గెట్ ఎక్కువగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారీ బడ్జెట్ ఈ సినిమాకు పెద్ద తలనొప్పిగా మారింది.. వస్తున్న కలెక్షన్స్‌తో ఇది ఏమాత్రం మ్యాచ్ కావడం లేదు. మూడు రోజుల వరకు కేవలం 22.54 శాతం పెట్టుబడిని మాత్రమే విక్రమ్ రికవరీ చేశాడు. అయితే శనివారం నుంచి వీర ధీర శూర కలెక్షన్స్‌లో కాస్త మెరుగుదల కనిపిస్తోంది. థియేటర్ ఆక్యూపెన్సీ కూడా బాగుండటంతో మేకర్స్ ఊపిరి తీసుకుంటున్నారు. ఇక నాలుగో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ఆదివారం వీర ధీర శూర ఎక్సలెంట్ హోల్డ్ చూపించింది.

మార్నింగ్ షోల నుంచే తమిళనాడులో ప్రేక్షకుల తాకిడి మొదలైంది. ఉదయం ఆటలకు 24.42 శాతం, మ్యాట్నీలకు 52.24 శాతం, ఫస్ట్ షోలకు 50.78 శాతం, సెకండ్ షోలకు 51.52 శాతం ఆక్యూపెన్సీతో ఓవరాల్‌గా 44.74 శాతం బుకింగ్స్ సొంతం చేసుకుని దుమ్మరేపింది. చెన్నైలో 518 షోలు, బెంగళూరులో 233 షోలు, మధురైలో 115, కోయంబత్తూరులో 224 షోలు పడ్డాయి.

ఇక నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే .. ప్రపంచవ్యాప్తగా రూ. 6.65 కోట్ల వసూళ్లను సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్‌తో కలుపుకుంటే ఇది రూ. 7 కోట్ల వరకు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా నాలుగు రోజులకు గాను ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 21 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం రంజాన్ పర్వదినం కావడంతో ఈ సినిమా వసూళ్లు బాగుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X